Diabetes Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి. గ్లూకోజ్ స్థాయి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు వ్యాయామం, డైట్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నల్ల నువ్వులతో డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు కలిగే ప్రయోజనాలు ఇతర వివరాలు తెలుసుకుందాం.
నల్ల నువ్వుల్లో ఉండే పోషకాల కారణంగా మెదడు, చర్మం, శరీరంలోని అంతర్గతంగా ఉండే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వులు తినడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.
మధుమేహం ఉన్నప్పుడు నల్ల నువ్వులు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు అలసట, బలహీనత దూరమౌతాయి.
ఒక గ్లాసు నీళ్లలో 2 చెంచాల నవ్వులు కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచిన వెంటనే ఆ నువ్వుల్ని నమిలి తినాలి.
నల్ల నువ్వుల్నివేయించుకుని పెట్టుకోవాలి. రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నువ్వులు తిని నీళ్లు తాగాలి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు నల్ల నువ్వులు కీలకంగా ఉపయోగపడతాయి.. ఇది కాకుండా ఇంకా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు నల్ల నువ్వులు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్లు, పినోరెసినోల్ అనే పోషకం కారణంగా శరీరంలో ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి.