Republi Day 2024: రిపబ్లిక్ డే దేశ ప్రజలందరికీ చాలా ప్రత్యేకమైంది. ఇదే రోజు దేశ రాజ్యాంగం ఆమోదం పొందింది. అమల్లోకి వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ పబ్లిక్ హాలిడే. మరి ఈ సెలవు రోజును ఎలా గడపాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనేది తెలుసుకుందాం..
ఆట పాటల కార్యక్రమాలు రిపబ్లిక్ డే రోజున పిల్లల కోసం ఏదైనా మంచి వినోద కాలక్షేపం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. పాటల పోటీలు, క్రీడా పోటీల నిర్వహణ వంటివి జరపవచ్చు.
దేశ భక్తి సినిమాలు రిపబ్లిక్ డే సెలవు రోజు ఏం చేయాలో తెలియకపోతే దేశభక్తిని చాటిచెప్పే సినిమాలు చాలా ఉన్నాయి. భగత్ సింగ్ వంటి సినిమాలు చూస్తే దేశంలో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు.
డ్యాన్స్ ప్రోగ్రామ్ మీరు ఉండేది ఏదైనా కాలనీ లేదా సొసైటీలో అయితే ఆ రోజు దేశ భక్తికి చిహ్నంగా ప్రత్యేక నృత్య కార్యక్రమాలు, దేశ భక్తి పాటల కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
చరిత్ర తెలుసుకోవడం ఇంట్లో జెండా ఎగురవేసిన తరువాత ఆ రోజంతా వృధా చేయకుండా దేశ చరిత్రను చదివి తెలుసుకుంటే మంచిది. దీనివల్ల విజ్ఞానం పెరగడమే కాదు..మీ పిల్లలకు కూడా ఆ చరిత్ర చెప్పేందుకు వీలవుతుంది.
జెండా ఎగురవేయడం స్కూల్ లేదా కాలేజ్ లేదా పెరేడ్ గ్రౌండ్స్‌లోనే కాదు..రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్కడైనా మీ ఇంటిపై కూడా జెండా ఎగురవేయవచ్చు. మీరు కూడా మీ ఇంటిపై లేదా ఇంటి ప్రాంగణంలో జెండా ఎగురవేసి..చుట్టుపక్కల పిల్లలకు స్వీట్స్ లేదా చాకోలేట్స్ పంచండి. ఎప్పటిక మర్చిపోలేని అనుభూతి లభిస్తుంది.