Shakeela Lodged Case: నటి షకీలాపై పెంపుడు కూతురు దాడి.. ఠాణాకు చేరిన పంచాయితీ

Attack on Shakeela: నటిగా ప్రేక్షకులకు వినోదం పంచిన షకీల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌లో కొన్ని వారాలు ఉండి సందడి చేశారు. అప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అల్లారుముద్దుగా చూసుకున్న పెంపుడు కూతురే షకీలాపై దాడి చేసింది. తన సొంత తల్లిని తీసుకునివచ్చి దాడికి పాల్పడడంతో వీరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది

Last Updated : Jan 21, 2024, 10:18 PM IST
Shakeela Lodged Case: నటి షకీలాపై పెంపుడు కూతురు దాడి.. ఠాణాకు చేరిన పంచాయితీ

Shakeela Lodgs a Case: ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌లో కొన్ని వారాలు గడిపి ప్రేక్షకులను ఆకట్టుకున్న షకీలా మళ్లీ వార్తల్లో నిలిచారు. కుటుంబ వ్యవహారాల్లో జరిగిన ఘర్షణతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ అనంతరం షకీలా చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఒక అమ్మాయిని పెంచుకుంటున్నారు. ఆమె పేరు శీతల్‌. ఆమె ఎవరో షకీలా సొంత అన్న కూతురే. వరుసకు శీతల్‌ షకీలాకు మేన కోడలు అవుతుంది. కొన్నిరోజులుగా వీరి కుటుంబ వ్యవహారాల్లో గొడవ జరుగుతున్నట్లు సమాచారం. 

ఈనెల 20వ తేదీన మరోసారి శీతల్‌, షకీలా మధ్య మరోసారి గొడవలు జరిగాయి. వెంటనే ఇంట్లో నుంచి శీతల్‌ వెళ్లిపోయింది. ఆ తర్వాత శీతల్‌ తన సొంత తల్లిని తీసుకుని వచ్చి గొడవకు దిగింది. నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తనపై శీతల్‌ దాడి చేసిందని షకీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదితో శీతల్‌ తల్లి విచక్షణ కోల్పోయి ప్రవర్తించిందని ఫిర్యాదులో షకీలా పేర్కొన్నారు. శీతల్‌ కూడా షకీలాపై ఫిర్యాదు చేసింది. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారణంగా విచారణ చేపట్టనున్నారు. 

బిగ్‌బాస్‌
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన షకీలా ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన షకీలా ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాల్లో షకీలా నటించారు. ఇటీవల బిగ్‌బాస్‌లో పాల్గొని వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బిగ్‌బాస్‌లో ఉన్న విషయం తెలిసిందే. రెండు వారాలు విజయవంతంగా హౌస్‌లో ఉన్నారు. తోటి కంటెస్టెంట్ల అమ్మ రూపంలో షకీలా వ్యవహరించారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ.. నవ్విస్తుండేది. టాస్క్‌ల్లో కూడా తన శక్తికి మించి ప్రదర్శన చేశారు. ఆమెకు అంతగా ఓటింగ్‌ శాతం లేకపోవడంతో ఎలిమినేట్‌ అయ్యారు. ఆమె ఎలిమినేట్‌తో కంటెస్టెంట్లంతా బాధపడిన విషయం తెలిసిందే.

Also Read: Ayodhya Holiday: అయోధ్య ఆలయంపై డీకే శివ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News