New Ration Cards: కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే ఫిజికల్ వెరిఫికేషన్‌లో ఇవి తప్పనిసరి..

New Ration Card Apply: తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులను అందించబోతోంది. రేషన్ కార్డ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 12:01 PM IST
 New Ration Cards: కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే ఫిజికల్ వెరిఫికేషన్‌లో ఇవి తప్పనిసరి..

New Ration Cards In Telangana: కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే 2024 సంవత్సరంలోని జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. రేషన్ కార్డ్ దరఖాస్తులను నేరుగా గ్రామసభల నుంచి స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి జారీ చేసే కొత్త రేషన్ కార్డుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలుస్తోంది. మొదట కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులను కేవలం అర్హులైన వారికి మాత్రమే అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా మొదట ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత అర్హులను నిర్ధారించుకొని జనవరి నెలలో రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

ఇప్పటికే పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల జారీ అనుసరించాల్సిన పద్ధతులు అర్హులను పరిగణలోకి తీసుకొని నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన కలెక్టర్ మీటింగ్లో 5 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ను సదరు శాఖ అందజేసింది.

అంతేకాకుండా నూతన రేషన్ కార్డులను పొందడానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా అన్ని గ్రామాల్లోని వాడవాడలా విస్తృత ప్రచారం చేయాలని డాక్యుమెంట్లలో పౌరసరఫరాల శాఖ తెలిపింది. దీంతోపాటు మండల ఆఫీసర్స్ అయిన తహసిల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామాలలో తిరిగి ప్రజలకు నూతన రేషన్ కార్డుల అప్లికేషన్ గురించి వివరించాలని పేర్కొంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

దీంతోపాటు అప్లికేషన్ పరిశీలించడానికి ముఖ్యంగా ఫిజికల్ వెరిఫికేషన్ చేయడానికి జిల్లా కలెక్టర్ మొదలుకొని ఎమ్మార్వో వరకు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది. అంతేకాకుండా రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియలు అధికారులు ప్రజల నుంచి సేకరించిన దరఖాస్తులను నెంబర్ కూడా చేస్తారు. దీంతోపాటు ఆ వివరాలను సంబంధిత అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్‌కు అందిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది.

రేషన్ కార్డులను జారీ చేయడానికి ముందుగా దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితులు, జీవన విధానాన్ని అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే చివరి ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా జరిగిన తర్వాతే రేషన్ కార్డు ఇవ్వాలా వద్దా? అని నిర్ణయం అధికారులు తీసుకుంటారని పౌరసరఫరాల శాఖ తెలిపింది. అంతేకాకుండా ఒకవేళ బోగస్ అప్లికేషన్ పెట్టుకునే వారికి అధికారులు రేషన్ కార్డు ఇవ్వకూడదని భావిస్తే ఆ వివరాలను ఇతర సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News