/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

IRCTC Vaishno Devi Tour: విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికోసం భారత రైల్వే ఎప్పటికప్పుడు అద్భుతమైన టూర్ ప్యాకేజీలను అందిస్తూ ఉంటుంది. ఈ ప్యాకేజీలతో అతి తక్కువ బడ్జెట్ లోనే ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు చేయవచ్చు. ప్రస్తుతం భారతీయ రైల్వే భారతదేశవ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మీరు కూడా అతి తక్కువ బడ్జెట్లో కార్తీక మాసం సందర్భంగా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం భారతీయ రైల్వే బంపర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. అయితే ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది వైష్ణో దేవి ఆలయానికి వెళ్తూ ఉంటారు అయితే ఈ భక్తులను దృష్టిలో పెట్టుకొని భారత రైల్వే అద్భుతమైన ప్యాకేజీని తీసుకువచ్చింది.  ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం రూ. 1,700 చెల్లిస్తే..భారత రైల్వే థర్డ్ ఏసీలో రైల్లో ప్రయాణం చేయడమే కాకుండా ఫైవ్ స్టార్ హోటల్లో భోజన సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మూడు రాత్రులు, నాలుగు రోజులపాటు ఉంటుంది. ఇవే కాకుండా అనేక సౌకర్యాలను ఉచితంగా అందిస్తోంది.

టూర్ పూర్తి వివరాలు ఇవే:
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూర్ ప్యాకేజీ కింద ఈ వైష్ణో దేవి టూర్ డిసెంబరు 10 నుంచి ప్రారంభం కాగా..ఢిల్లీ నుంచి ప్రతిరోజూ రైళ్లను నడుపుతోంది.  మాతా వైష్ణో దేవిని సందర్శించాలనుకునే భక్తులు నేరుగా అధికారిక IRCTC టూరిజం సైట్‌ను సందర్శించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రతిరోజు రాత్రి 10:40 నిమిషాలకు ప్రారంభమవుతుంది..ఆ తర్వాతి ఈరోజు ఉదయం 5 గంటలకు జమ్మూకు చేరుకుంటుంది. కొన్ని రైళ్లు ఢిల్లీ నుంచి నేరుగా కత్రా చేరుకుంటాయి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఆ తర్వాత ప్రయాణికులు అంతా కలిసి సరస్వతీభవన్లో కొంతసేపు రెస్ట్ తీసుకొని హోటల్ గదిలకు సంబంధించిన వివరాలను భారతీయ రైల్వే అందిస్తుంది. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత రూ. 6,795 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన తర్వాత ముగ్గురికి కలిసి ఒక లగ్జరీ రూమ్ ని అందిస్తారు. ఇక ఇదే హోటల్ గదిలో ఒక్కరు ఉండేందుకు రూ.10395 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీతో ఉన్న పిల్లలకు కూడా హోటల్ డబ్బులను చార్జ్ చేస్తుంది. కాబట్టి పిల్లలు ఉన్నవారు తప్పకుండా రూ.6,160 రూపాయలు చెల్లించాల్సిందే.

హోటల్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాత భక్తులు మాతా వైష్ణో దేవి దర్శనం కోసం బయలుదేరుతారు. దీనికోసం మీరు ఉన్న హోటల్ వద్దకే భారత రైల్వే బస్సును పంపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఈ బస్సులో అమ్మవారి దర్శనానికి దేవాలయం వద్దకు చేరుకుంటారు. దర్శనం ముగిసిన తర్వాత అదే బస్సులో తిరిగి హోటల్ కి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాత్రి విశ్రాంతి తీసుకుని ఆ మరుసటి రోజు ఉదయం 12 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. హోటల్ వాళ్ళ అందించిన అదే బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని జమ్మూ రైల్వే స్టేషన్ లోకి రావాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ కి చేరుకున్న తర్వాత రాజధాని రైల్లో ఢిల్లీకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Irctc Vaishno Devi Tour: Pay Only Rs. 1,700 To Visit Vaishno Devi Temple In Jammu As Part Of Irctc Tour Packages
News Source: 
Home Title: 

Vaishno Devi Tour: కేవలం రూ. 1,700 చెల్లిస్తే జమ్ములోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు..IRCTC ప్యాకేజీ పూర్తి వివరాలు..
 

Vaishno Devi Tour: కేవలం రూ. 1,700 చెల్లిస్తే జమ్ములోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు..IRCTC ప్యాకేజీ పూర్తి వివరాలు..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కేవలం రూ. 1,700 చెల్లిస్తే జమ్ములోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, December 13, 2023 - 23:04
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
33
Is Breaking News: 
No
Word Count: 
379