Budget spots for Pre-wedding photos: పెళ్లి అనగానే ప్రస్తుతం ఎక్కువగా వినిపించే ఫస్ట్ పదం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు?ఎక్కడ? పెళ్లిలలో నలుగులు, ప్రధానాలు ఎంత కామన్ అయిపోయాయో..ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంతకంటే కామన్ అయిపోయాయి. అయితే ఎక్కడ తీసుకోవాలి అనేది చాలామందికి పెద్ద సమస్యగా మారుతుంది మొదటిది బడ్జెట్ అయితే రెండవది మాంచి లోకేషన్ . అయితే మీ బడ్జెట్ లోనే బెస్ట్ లొకేషన్స్ మనకు దగ్గరలోనే ఉన్నాయి అంటే నమ్ముతారా? మరి ఇంతకీ ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా?
చాలామందికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలి అన్న కోరిక ఉన్నప్పటికీ బడ్జెట్ విషయంలో ఇబ్బందుల కారణంగా ఆ ఐడియాని పక్కన పెడతారు. లొకేషన్స్ కి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అనే ఫీలింగ్ వల్ల చాలామంది అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దు అనుకుంటారు. మనకు తెలియని విషయం ఏమిటంటే చాలా లొకేషన్స్ కి డబ్బు కట్టాల్సిన అవసరమే లేదు.. మనం అక్కడికి వెళ్తే చాలు.. ఎటువంటి ఖర్చు లేకుండా హ్యాపీగా ఫొటోస్ దిగొచ్చు. ఈ లొకేషన్స్ ముంబై నగరం లోనే ఉన్నాయి.
జూహూ బీచ్..
ముంబైలోని అద్భుతమైన నేచర్ వండర్ జుహు బీచ్. ఇసుక తినల మీద ..సముద్రపు అలల మధ్యన ..ఎంచక్క ప్రీ వెడ్డింగ్ షూట్ అద్భుతంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సన్సెట్.. సన్ రైస్ టైం లో తీసే ఫొటోస్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి.
మెరైన్ డ్రైవ్
మంచి రొమాంటిక్ ఫోటోషూట్ కావాలి అనుకున్న వాళ్లు కచ్చితంగా విజిట్ చేయాల్సిన స్పాట్ మెరైన్ డ్రైవ్. దీన్నే ది క్విన్స్ నెక్లెస్ అని కూడా పిలుస్తారు. ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లొకేషన్స్ లో ద బెస్ట్ గా దీన్ని వర్ణించొచ్చు.
సంజయ్ గాంధీ నేషనల్ పార్క్
ముంబైలో మరొక బెస్ట్ నాచురల్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ స్పాట్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ప్రకృతి సోయగాల మధ్య మంచి ఫొటోస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి.. మంచి అడవి నేపథ్యంలో అందాలు బంధించాలి అనుకునే వాళ్లకు ఈ స్పాట్ బెస్ట్. గ్రీన్ బ్యాక్‌డ్రాప్ ఫోటోషూట్స్ కు ఇది బెస్ట్ లొకేషన్.
హాంగింగ్ గార్డెన్స్
రొమాంటిక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కు హాంగింగ్ గార్డెన్స్ అధ్బుతమైన లొకేషన్. ఇక్కడ సుందరమైన ప్రకృతి మీ ఫొటోస్ ను మరింత హై లైట్ చేస్తాయి.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook