Best Winter Juice: చలికాలంలో రోజూ ఈ జ్యూస్ తాగితే కేన్సర్, బీపీ, మలబద్ధకం అన్నీ మాయం, అధిక బరువుకు చెక్

చలికాలం ప్రారంభమైపోయింది. శరీరంలో ఇమ్యూనిటీ క్షీణించి వివిధ రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు చలికాలంలో తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం సరైన ప్రత్యామ్నాయం బీట్‌రూట్, క్యారట్ జ్యూస్. ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలున్నాయి.

Best Winter Juice: చలికాలం ప్రారంభమైపోయింది. శరీరంలో ఇమ్యూనిటీ క్షీణించి వివిధ రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు చలికాలంలో తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం సరైన ప్రత్యామ్నాయం బీట్‌రూట్, క్యారట్ జ్యూస్. ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలున్నాయి.

1 /5

జీర్ణక్రియ మెరుగుపడటం ఆయుర్వేద వైద్యుల ప్రకారం బీట్‌రూట్, క్యారట్ జ్యూస్‌లో ఉండే ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువ. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.

2 /5

రక్తహీనతకు చెక్ చాలామందికి ఎనీమియా ఉంటుంది. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీట్‌రూట్, క్యారట్ జ్యూస్ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. 

3 /5

బరువు నియంత్రణ స్థూలకాయంతో ఇబ్బందిపడేవారికి ఇదొక అద్భుతమైన డైట్. రోజూ క్రమం తప్పకుండా బీట్‌రూట్, క్యారట్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి, కేలరీలు తగ్గుతాయి. దాంతో శరీరం ఫిట్‌గా ఉంటుంది.

4 /5

రక్తపోటు నియంత్రణ అధిక రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు చలికాలంలో బీట్‌రూట్, క్యారట్ జ్యూస్ తప్పకుండా సేవించాలి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం మీ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

5 /5

కేన్సర్ నుంచి రక్షణ ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో బీట్‌రూట్, క్యారట్ జ్యూస్ తాగడం వల్ల కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో చాలా రకాల యాంటీ కేన్సర్ గుణాలుంటాయి. ఫలితంగా శరీరంలో కేన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.