Magnesium: మహిళలకు మెగ్నీషియం ఎందుకు అవసరం, పీరియడ్స్ సమస్యలకు ఉపశమనం లభిస్తుందా

Magnesium: మనిషి శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ప్రత్యేకించి మహిళలకు చాలా ప్రయోజనకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర, అరటి, బాదం, జీడిపప్పు, సీడ్స్ వంటి పదార్ధాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 

Magnesium: ఇటీవలి కాలంలో మహిళలు అటు ఆఫీసు, ఇటు ఇంటి పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఫలితంగా చాలా రకాల పోషకాల లోపం ఏర్పడుతోంది. దాంతో బలహీనత, అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మెగ్నీషియం ఆధారిత ఆహార పదార్ధాలు తింటే మహిళలు ఎదుర్కొనే చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
 

1 /5

గర్భిణీ మహిళలకు ప్రయోజనం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు మెగ్నీషియం శరీర నిర్మాణం కోసం తీసుకోవల్సి ఉంటుంది. గర్భిణీగా ఉన్నప్పుడు మెగ్నీషియం లోపిస్తే ప్రీ ఎక్లాంప్సియా, బలహీనమైన శిశువు ఎదుగుదల, శిశువు మరణించడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. 

2 /5

స్వెల్లింగ్ సమస్య దూరం మెగ్నీషియం తక్కువైతే స్వెల్లింగ్ సమస్య పెరగవచ్చు.  సీ రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకిన్ 6 వంటి సమస్యల్ని తగ్గించేందుకు మెగ్నీషియం ఉపయోగపడుతుంది. 

3 /5

ప్రశాంతమైన నిద్ర మెగ్నీషియం అనేది మనిషికి రిలాక్సేషన్ పెంచుతుంది. మెలానిన్ ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని స్లీప్ పాటర్న్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. మెగ్నీషియం అనేది మెలటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ప్రశాంతమైన నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతుంది.

4 /5

పీరియడ్స్ సమయంలో ఉపశమనం మెగ్నీషియం సహాయంతో పీరియడ్స్ నొప్పుల్ని తగ్గించవచ్చు. మాంస కండరాలకు ఉపశమనం కల్గించి ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  పీరియడ్స్‌లో క్రాంప్స్ సమస్యను తగ్గిస్తుంది.

5 /5

ఎముకలకు బలం మెగ్నీషియం అనేది విటమిన్ డిని యాక్టివ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. కాల్షియం సంగ్రహణ, మెటబోలిజంతో పాటు సాధారణ పారా థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. మహిళల్లో ఉండే ఆస్టియోపోరోసిస్, ఎముకలు విరగడం వంటి ముప్పును తగ్గిస్తుంది. ప్రత్యేకించి మెనోపాజ్ తరువాత మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి.