Turmeric Benefits: పసుపు అనేది ప్రతి కిచెన్లో తప్పకుండా వినియోగించే మసాలా పదార్దం. ఇదొక శక్తివంతమైన ఆయుర్వేద వేరు. పసుపుతో ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. కర్క్యూమిన్ పెద్దమొత్తంలో ఉండే పదార్ధమిది. ఆయుర్వేద శాస్త్రంలో పసుపును అద్భుతమైన ఔషధంగా భావిస్తారు.
Turmeric Benefits: ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో పుష్కలంగా లభించే కర్క్యూమిన్ కారణంగా స్వెల్లింగ్, అంటురోగాల ముప్పు, ఆక్సిడేటివ్ డ్యామేజ్ దూరమౌతాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చాలా ఉంటాయి.
పసుపుతో దూరమయ్యే వ్యాధులు అల్జీమర్స్, కేన్సర్, ఆర్థరైటిస్, ఆస్థమా, కొలెస్ట్రాల్, జీర్ణ సంబంధిత సమస్యలు, వాంతులు-విరేచనాలు, గుండె వ్యాధులు, కడుపు సమస్య, సర్జరీ తరువాత పరిస్థితి, తలనొప్పి, దురద, చర్మ ఇన్ఫెక్షన్, కడుపులో పురుగులు, కీళ్ల నొప్పులు, ముక్కు క్లోజ్ అవడం, స్వెల్లింగ్, జ్వరం, ఇమ్యూనిటీ సమస్య, అంటురోగాలు, హిమోగ్లోబిన్ లోపం, నిద్రలేమి సమస్యలు పసుపుతో దూరం చేయవచ్చు.
ఉసిరి ప్రీ డయాబెటిక్ కేసుల్లో పసుపుతో ఉసిరి కలిపి తీసుకోవాలి
నీరు బరువు తగ్గించేందుకు, చర్మ సంబంధిత రోగాలు దూరం చేసేందుకు వేడి నీళ్లలో పసుపు కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
పాలు గాయాలు మానేందుకు, జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు తొలగించేందుకు, కాల్షియం లోపం దూరం చేసేందుకు పసుపు పాలు మంచి ఔషధం.
నిమ్మ ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేసేందుకు పసుపును నిమ్మరసంతో కలిపి సేవిస్తే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి.
తేనె శరీరం ఇమ్యూనిటీ పెంచేందుకు పసుపుతో పాటు నెయ్యి, తేనె కలిపి వాడితే చాలా మంచి ఫలితాలుంటాయి.