iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15.. ప్రస్తుతం ప్రీమియం ఫోన్స్ కోసం చూస్తున్న వారు ఎక్కడికెళ్లినా వినిపిస్తున్న పేరే ఈ ఐఫోన్ 15. ఇటీవలే లాంచ్ అయిన ఈ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుక్కుని తమ డ్రీమ్ ఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇప్పటికే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుక్కుని ఉపయోగిస్తున్న వారు ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ యూజర్స్ చెబుతున్న సమస్య ఏంటో తెలిస్తే ఐఫోన్ కొనుక్కోవాలని కలలు కంటున్న వారు తాము ముందడుగు వేయాలా వద్దా అని ఆలోచించాల్సిందే. ఎందుకంటే అది కేవలం ఫీచర్స్ లేదా టెక్నాలజీకి సంబంధించిన విషయం కాదు.. అది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మొబైల్ యూజర్స్ సేఫ్టీకి సంబంధించిన సమస్య.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మాక్స్ మొబైల్స్ ఓవర్ హీటింగ్ అవుతున్నట్టు ఆ ఫోన్ ఉపయోగిస్తున్న వారు కంప్లయింట్స్ రైజ్ చేస్తున్నారు.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో అలాగే ఎక్కువసేపు బ్రౌజింగ్ లేదా ఫోన్ మాట్లాడటం వంటివి చేస్తున్నప్పుడు ఐఫోన్ 15 ప్రో మాక్స్ మొబైల్ ఓవర్ హీట్ అవుతున్నట్టుగా వినియోగదారులు గుర్తించారు.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: కెమెరా సెటప్ ఉన్న ప్రాంతానికి కింది భాగంలో కుడి వైపున ఫోన్ వేడెక్కుతున్నట్టు ఐఫోన్ 15 ప్రో మాక్స్ మొబైల్ వినియోగదారులు గుర్తించారు. ఇదే విషయాన్ని నెటిజెన్స్‌తో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెడుతున్నారు.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఒకరకంగా ఇది ఐఫోన్ 15 ప్రో మాక్స్ మొబైల్ కొనాలి అని ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక అలర్ట్ అయితే.. ఇప్పటికే కొన్న వారు ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాల్సిందే అనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్యను 2 సందర్భాల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కాగా మరొకటి ఎక్కువసేపు ఉపయోగించే సమయంలో ఫోన్ హీటెక్కుతోంది.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: చాటింగ్ యాప్స్ మధ్య స్విచింగ్ చేసేటప్పుడు, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న సందర్భాల్లోనూ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ హీటెక్కుతోంది.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం, 65W USB PD GaN ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ ఓవర్ హీటింగ్ సమస్య ఉందని తెలుస్తోంది.
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఒకవేళ, 15W USB PD ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కడం లేదు. కాకపోతే ఛార్జింగ్ అవ్వాల్సిన స్పీడ్ కంటే చాలా నెమ్మదిగా చార్జ్ అవుతోంది.