Stocks To Buy Today For High Returns: కేవలం 5 నుండి 15 రోజుల్లో భారీ లాభాలు ఇచ్చే స్టాక్స్

Stocks To Buy Today For High Returns: స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండిస్తున్న షేర్ల గురించి తెలియక కొంతమంది ఇన్వెస్టర్స్ ఏవేవో షేర్లు కొనుగోలు చేసి నిండా నష్టపోతుంటారు. అలాంటి వారి కోసమే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు తాము అధ్యయనం చేసిన షేర్ల గురించి చెబుతూ తాము చెప్పిన నిబంధనలు పాటిస్తూ పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చు అని చెబుతుంటాయి.

Stocks To Buy Today For High Returns: యాక్సిక్ బ్యాంకుకి చెందిన యాక్సిస్ డైరెక్ట్ కూడా తాజాగా కేవలం 5 రోజుల నుండి 15 రోజుల పెట్టుబడి కోసం కొన్ని షేర్లను సూచించింది. ఆయా షేర్లకు సంబంధించిన ప్రస్తుత ధర ఎంత, టార్గెట్ ధర ఎంత, ఎక్కడ స్టాప్‌లాస్ పెట్టుకోవచ్చు అనే విషయాలను క్లుప్తంగా వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.
 

1 /6

Stocks To Buy Today For High Returns, IDBI stocks news : ఐడిబీఐ స్టాక్స్   ఐడిబీఐ బ్యాంక్ స్టాక్ ప్రస్తుతం రూ. 71.25 వద్ద ట్రేడ్ అవుతుండగా ఇది రాబోయే 15 రోజుల్లో 86 రూపాయల మార్క్ తాకుతుంది అని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. 67 రూపాయల వద్ద స్టాప్‌లాస్ పెట్టాల్సిందిగా యాక్సిస్ డైరెక్ట్ సూచించింది.

2 /6

Stocks To Buy Today For High Returns, Granules India stocks news : గ్రాన్యూల్స్ ఇండియా :  గ్రాన్యూల్స్ ఇండియా షేర్స్ ప్రస్తుతం 337 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా మరో 15 రోజుల్లో ఈ స్టాక్ 356 రూపాయల మార్క్ టచ్ అవుతుంది అని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేస్తున్నట్టు చెప్పింది. 320 రూపాయల వద్ద స్టాప్ లాస్ పాయింట్ ఉండాల్సిందిగా యాక్సిస్ డైరెక్ట్ సూచించింది.

3 /6

Stocks To Buy Today For High Returns, CDSL stocks news : సీడీఎస్ఎల్  :  క్యాపిటల్ మార్కెట్ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) షేర్స్ ప్రస్తుతం 1312 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇవి మరో 15 రోజుల్లో 1390 రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉందని యాక్సిడ్ డైరెక్ట్ స్పష్టంచేసింది. అలాగే 1290 రూపాయల వద్ద స్టాప్‌లాస్ విధించాల్సిందిగా సీడీఎస్ఎస్ వెల్లడించింది.

4 /6

Stocks To Buy Today For High Returns, TCS stocks news : టీసీఎస్  :  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి చెందిన టీసీఎస్ షేర్స్ ప్రస్తుతం 3603 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రాబోయే 15 రోజుల్లో టీసీఎస్ షేర్స్ 3788 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉందని.. అదే సమయంలో 3540 రూపాయల వద్ద స్టాప్‌లాస్ విధించుకోవాలని యాక్సిస్ డైరెక్ట్ అభిప్రాయపడింది.

5 /6

Stocks To Buy Today For High Returns, L&T stocks news : ఎల్ అండ్ టి  :  ఎల్ అండ్ టి స్టాక్ ప్రస్తుతం రూ. 2918 వద్ద ట్రేడ్ అవుతుండగా ఇది రాబోయే 15 రోజుల్లో 3060 రూపాయల మార్క్ తాకుతుంది అని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. 2880 రూపాయల వద్ద స్టాప్‌లాస్ పెట్టాల్సిందిగా యాక్సిస్ డైరెక్ట్ సూచించింది.

6 /6

Stocks To Buy Today For High Returns, Stock market news : ఇక్కడ పేర్కొన్న స్టాక్స్ అన్నీ ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యాక్సిస్ డైరెక్ట్ అంచనాల మేరకే వెల్లడించడం జరిగింది కానీ ఇందులో జీ తెలుగు న్యూస్ సొంత అభిప్రాయాలు లేవు అని గమనించగలరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆయా స్టాక్స్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత కానీ లేదా మీ బిజినెస్ అడ్వైజర్‌తో చర్చించిన తరువాత కానీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోగలరు.  ఇది కూడా చదవండి : Drinking Beer or Alcohol ?: బయటికెళ్లి బీర్ తాగుతున్నారా ? ఇవి మర్చిపోవద్దు  ఇది కూడా చదవండి : Selling Your Used Car: మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా ? ఇది కూడా చదవండి : Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే ఇది కూడా చదవండి : Namrata Malla in without BRA Look: బ్రా లేకుండా బయటికొచ్చి రచ్చ రచ్చ చేసిన నమ్రతా మల్లా