Anand New Movie: ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సమంత..

Anand deverakonda latest Movie: బేబీ హీరో ఆనంద్‌ దేవర కొండ లేటెస్ట్ మూవీ ‘'గం..గం..గణేశా'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 01:52 PM IST
Anand New Movie: ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సమంత..

Gam Gam Ganesha Movie: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవర కొండ (Anand Deverakonda) నయా మూవీ ‘'గం..గం..గణేశా'(Gam Gam Ganesha Movie). ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ శెట్టి డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. బేబీలో ఆనంద్ తన నటనతో ఆడియెన్స్ ను ఫిదా చేశారు. బేబీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘గం..గం..గణేశా మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఖుషి బ్యూటీ సమంత(Samantha) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సామ్ కు ధన్యవాదాలు తెలిపాడు ఆనంద్. ఇందులో ఆనంద్ రెండు గన్స్ పట్టుకుని ఉన్నాడు. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ లో గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ - ఫన్ - గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది. మెుత్తంగా ఫస్ట్ లుక్ ను ఇంటస్ట్రీంగ్ డిజైన్ చేశారు మేకర్స్. దీంతో ఈ మోసన్ పోస్టర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. 

దొరసాని, మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, పుష్పకవిమానం, బేబీ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్‌ దేవర కొండ. విభిన్న పాత్రలను ఎంచుకంటూ ఫ్యామిలీ అండ్ యూత్ లో మాంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఈ యువ హీరో. విజయ్ దేవరకొండ తమ్ముడిగా కాకుండాతన నటనతో ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 

Also Read: Jawan Box Office Collection day 5: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న షారుక్ దండయాత్ర.. రూ.500 కోట్ల క్లబ్ లో జవాన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News