Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నిన్న నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఇవాళ సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబే కీలక కుట్రధారిగా పేర్కొంటూ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ కోర్టులో సమర్పించింది సీఐడీ. స్కాం అంతా చంద్రబాబు కనుసన్నల్లో జరిగిందంటూ తీవ్రమైన అభియోగాలు మోపింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ సీఐడీ కోర్టులో ఆయనను హాజరుపర్చడమే కాకుండా 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ మెమో కూడా న్యాయమూర్తికి సమర్పించారు ఏపీసీఐడీ పోలీసులు. ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి చేయడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. ప్రస్తుతం కోర్టులో బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు, రిమాండ్ కోసం సీఐడీ న్యాయవాదుల మధ్య హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా, సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకాచారి వాదిస్తున్నారు.
ఈ కేసులో ఏ3గా చంద్రబాబు పేరును చేర్చుతూ రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది సీఐడీ. 371 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా అందులో 279 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లాయనేది సీఐడీ ప్రదాన అభియోగం. మొత్తం కుంభకోణంతా చంద్రబాబు కన్నుసన్నల్లోనే జరిగిందని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. 2021 డిసెంబర్ 9కు ముందే నేరం జరిగిందని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్‌కు డబ్బులు అందాయని రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ వివరిస్తూ..కొత్తగా లోకేష్ పేరు చేర్చింది. కేవలం కంపెనీల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కాంట్రాక్ట్ కట్టబెట్టేశారని ఆరోపించింది. కేబినెట్ తీర్మానం పక్కనపెట్టి గంటా సుబ్బారావు తదితులకు లబ్ది చేకూర్చిందని సీఐడీ అభియోగం మోపింది. అచ్చెన్నాయుడు ఆద్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్స్ ఏర్పాటు చేశారని సీఐడీ తెలిపింది. 90 శాతం ఖర్చు సీమెన్స్ కంపెనీ భరిస్తుందంటూ కేబినెట్ ముందు అబద్దాలు చెప్పారని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి కే సునీత అభ్యంతరాల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సీఐడీ.
సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బపోస్ అలియాస్ సుమన్ బోస్‌తో కలిసి 2015 జూన్ 3న కుట్రపూరిత జీవో జారీ..3,281 కోట్ల కుంభకోణానికి ఆజ్యం పోశారని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది.
Also read: Chandrababu Case Updates: కాస్సేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు, మొహరించిన ఢిల్లీ న్యాయవాదులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook