Muslim Traditional Dresses: ఫ్రాన్స్ దేశం తాజాగా స్కూళ్లు, కళాశాలల్లో ముస్లిం మహిళల వస్త్రధారణ అయిన అబాయాను నిషేధించింది. ఇకపై స్కూళ్లలో విద్యార్దినులు వీటిని ధరించకూడదని ఆ దేశ విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Muslim Traditional Dresses: అసలీ అబాయా అంటే ఏమిటి, ముస్లిం మహిళలు ధరించే అబాయా, హిజాబ్, నకాబ్, బుర్ఖా, చాదర్‌ల మధ్య అంతరమేంటనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
షాయలా ఇది ఓ విధమైన హెడ్ గేర్. ముస్లిం మహిళలు సాధారణంగా ధరిస్తుంటారు. ఈ వస్త్రాన్ని చుట్టేసి పిన్ చేస్తుంటారు
నకాబ్ నకాబ్ అనేది ఓ రకమైన తెరలాంటి పదార్ధం. హిజాబ్ కూడా దీంతోపాటే ఉంటుంది. ఇది మొత్తం మొత్తం శరీరాన్ని కప్పేస్తుంది. కళ్ల వద్ద పారదర్శకంగా ఉండటంతో అటూ ఇటూ చూడవచ్చు
ఖిమార్ ఇది ముస్లిం మహిళలు ధరించే ఓ విధమైన తల భాగాన్ని కప్పే వస్త్రం. కేశాలు, మెడ, భుజాల వరకూ కప్పుతుంది ముఖం స్పష్టంగా కన్పిస్తుంది.
హిజాబ్ హిజాబ్ అనేది తల, మెడ భాగాన్ని కప్పుతుంది. కానీ ఇవి ధరించిన మహిళలకు ముఖం కన్పిస్తుంది. హిజాబ్‌నే హెడ్ స్కార్ఫ్ అని కూడా అంటారు.
చాదర్ చాదర్ అనేది శరీరాన్ని కప్పి ఉంచే ఓ వస్త్రం. పూర్తిగా వదులుగా ఉంటుంది. ఏ విధమైన కుట్టు ఉండకపోవచ్చు.
బుర్ఘా ఇది మొత్తం శరీరమంతా వదులుగా ఉండే వస్త్ర ధారణ. ఇస్లామిక్ సాంప్రదాయ వస్త్రధారణలో ఇదే అత్యుత్తమమైందిగా భావిస్తారు.
అల్ అమీరా ముస్లిం మహిళలు ధరించే టూ పీస్ కొంగులో ఫిటింగ్ టోపీ, దుపట్టా ఉంటాయి. కాస్త ఫిట్‌గా ఉంటుంది.
అబాయా అబాయా అంటే పూర్తిగా వదులుగా ఉండే ఓ రకం వస్త్ర ధారణ. ఇది ముఖం, చేతులు, కాళ్లు కాకుండా మిగిలిన అన్ని భాగాల్ని కప్పేస్తుంది.