Dreams: హిందూమతంలో జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో స్వప్న శాస్త్రానికి అంతే ప్రాధాన్యత ఉంది. ప్రతి కలకు ఓ అర్ధం, పరమార్ధం ఉంటుంది. కొన్ని కలలు శుభ పరిణామాల్ని సూచిస్తే మరి కొన్ని అశుభ పరిణామాలను సూచిస్తుంటుంది.
Dreams: కొన్ని కలలు అంతులేని ధనానికి చిహ్నమని చెబుతారు. మరికొన్ని కలలు ఏదైనా శుభ కార్యానికి ప్రతీకగా భావిస్తారు ఇంకొన్ని కలలు దుష్పరిణామాలకు అర్దం పడతాయి. ఇందులో ఈ ఐదు కలల్లో వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
పాము పాముల్ని ధనానికి రక్షకులుగా భావిస్తారు. కలలో పాములు కన్పిస్తే చాలా లాభదాయకం. భవిష్యత్తులో భారీగా డబ్బులు లభిస్తాయని అర్ధం.
గులాబీ పూలు కలలో గులాబీ పూలు కన్పించడం శుభ పరిణామం. ధన దేవత లక్ష్మీదేవికి గులాబీ పూవు చాలా ఇష్టం. అందుకే కలలో గులాబీ పూవు కన్పిస్తే త్వరలో ధనలాభం కలుగుతుందని అర్ధం.
కమలం ధనదేవత లక్ష్మీదేవి విరాజిల్లేది కమలం పూవుపైనే. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కమలం పూలను అర్పించడం లాభదాయకం. అందుకే మీ కలలో కమలం పూలు కన్పిస్తే మీపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్ధం. అంతులేని ధన సంపదనలు కలుగుతాయి.
డ్యాన్సింగ్ గర్ల్ కలలో డ్యాన్స్ చేస్తున్న కన్య కన్పిస్తే చాలా లాభదాయకం. ఇలాంటి కల రావడమంటే అర్ధం జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయని అర్ధం. అంటే మీకు త్వరలో ఉన్నత పదవి, డబ్బులు, గౌరవం అన్నీ చేకూరుతాయి
ఏనుగు హిందూ మతంలో ఏనుగు పూజ్యనీయ జంతువు. ఇంద్రుడినం ఐరావతం కూడా ఇదే. అందుకే కలలో ఏనుగు కన్పిస్తే ఉన్నత పదవి, గౌరవ మర్యాదలు లభిస్తాయి.