How To Lose Weight Fast Naturally And Permanently: ఊబకాయంలో బాధపడుతున్నవారు పొట్ట కారణంగా అందహీనంగా కనిపిస్తారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బరువు తగ్గే క్రమంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వీటి కారణంగా బరువు తగ్గినప్పటికీ తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పొరపాట్లు చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గే క్రమంలో ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి:
శరీరానికి తగినంత నిద్ర అవసరం:
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేవలం డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా ఆహారాలు తీసుకున్న, నిద్రపోయిన బరువు తగ్గడానికి బదులుగా పెరిగే అవకాశాలున్నాయి.
Also Read: Asthma Diet: ఆస్తమా రోగులు ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసా
ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోండి:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది ఆహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం నియంత్రించుకునే క్రమంలో తప్పకుండా ప్రోటిన్లు, ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీరక శ్రమ తప్పనిసరి:
చాలా మంది ఎక్కువ సేపు కూర్చుని పనులు చేయడం వల్ల లావుగా తయారవుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఒకే చోట ఎక్కువగా సేపు కూర్చోవడం మానుకోండి. ప్రతి రోజు గ్రీన్ టీలను తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook