Bank Manager Death Case: మహిళల లోదుస్తులు ధరించి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య.. ఉరితాడుకు ఆ దుస్తుల్లోనే..!

Bank Manager Hanging Ladies Undergarments: పంజాబ్‌లోని లూథియానాలో బ్యాంక్ మేనేజర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళల లోదుస్తులు ధరించి ఆయన ఉరివేసుకున్నలు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 10, 2023, 08:09 PM IST
Bank Manager Death Case: మహిళల లోదుస్తులు ధరించి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య.. ఉరితాడుకు ఆ దుస్తుల్లోనే..!

Bank Manager Hanging Ladies Undergarments: మహిళ లోదుస్తులు ధరించి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాబ్‌లోని లూథియానాలో వెలుగు చూసింది. అమర్‌పురా ప్రాంతంలోని ఓ ఇంట్లో  బ్యాంకు మేనేజర్ మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉరితాడుకు వేలాడుతున్న మేనేజర్.. మహిళ లోదుస్తులు ధరించినట్లు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ గదిలో ఇంకా మహిళల దుస్తులు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వివరాలు ఇలా.

ఫెరోజ్‌పూర్‌కు చెందిన వినోద్ మసీహ్‌ అనే వ్యక్తి కెనరా బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తి రీత్యా కుటుంబాన్ని వదిలి అమర్‌పూరా ప్రాంతంలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. రెండేళ్లూ ఇదే ఇంట్లో ఉంటున్న వినోద్.. నాలుగు రోజుల క్రితమే ఊరికి వెళ్లి వచ్చాడు. ఇంటి తలుపులు తీయకుండా అలాగే మూసి ఉండడంతో ఇంటి ఓనర్‌కు అనుమానం వచ్చింది. శనివారం ఉదయం తలుపులు కొట్టిన తీయకపోవడంతో.. బలవంతంగా డోర్ ఓపెన్ చేయగా షాక్‌కు గురయ్యాడు. మహిళల లోదుస్తులు ధరించి వినోద్ మసీహ్ ఉరి వేసుకుని కనిపించాడు. 

వెంటనే స్థానిక కౌన్సిలర్ గుర్దీప్ సింగ్ నీతుకు విషయం చెప్పాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ టీమ్‌ను కూడా ఘటన స్థలానికి పిలిపించి ఆధారాలు నమోదు చేశారు. మృతుడి మొబైల్‌ను సైబర్ సెల్‌కు విచారణ నిమిత్తం అందజేశారు. ఈ కేసులో కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. 

పోలీసులు మాట్లాడుతూ.. వినోద్ మసీహ్‌ ఇంట్లో మహిళల దుస్తులు ఉన్నాయని తెలిపారు. గురువారం రాత్రి లూథియానాలోని తన నివాసానికి వెళ్లి.. కుటుంబ సభ్యులను కలిసి వచ్చాడని చెప్పారు. పూర్తిస్థాయిల దర్యాప్తు నిర్వహించి.. పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

Also Read: Govt Jobs 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి భారీ రిక్రూట్‌మెంట్‌.. దరఖాస్తు వివరాలు ఇలా..!  

Also Read: Minister Harish Rao: మాటలు కోటలు దాటాయి.. చేతలు పకోడీ చేసినట్లు ఉంది: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News