White Hair To Black Hair: ఉసిరిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు ఈమిడి ఉంటాయి. కాబట్టి దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా ఉసిరిలో ఉండే విటమిన్ ఈ, విటమిన్ సి అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఉసిరికాయతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనితో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో ఖరీదైన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. వీటిని ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిపుణులు సూచించిన ఉసిరికాయతో తయారుచేసిన నూనెను వినియోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చని వారు చెబుతున్నారు. అయితే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో? ఎలా వినియోగించాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
ఉసిరి హెయిర్ ఆయిల్ తయారీ విధానం:
ముందుగా 6 నుంచి 10 వరకు పచ్చి ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వీటిని ఒక జల్లెట్లో వేసి బాగా ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టిన తర్వాత ఎండలో ఉంచి.. పూర్తిగా ఎండే వరకు అలానే ఉంచాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని పొడిలా తయారు చేసుకోవాలి.
ఇలా పొడిలా తయారుచేసిన తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఒక కప్పు నూనెను వేడి చేయాలి.
గోరువెచ్చగా నూనె వేడి అయిన తర్వాత ఉసిరి పొడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత రెండు నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచి ఒక సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ నూనెను ఎలా అప్లై చేయాలో తెలుసా?
ఈ నూనె అప్లై చేసుకునే ముందు జుట్టును తప్పకుండా ఆర్గానిక్ షాంపూ తో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గంట సేపు జుట్టుని ఆరనిచ్చి ఈ నూనెను అప్లై చేసుకోవాలి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు జుట్టు కుదుల్లా దగ్గర మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా మసాజ్ చేసిన తర్వాత గంటపాటు జుట్టును అలాగే ఉంచాలి.
ఆ తర్వాత జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా నూనెను క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారుతుంది.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
White Hair To Black Hair: తెల్ల జుట్టు ఏం చేసిన నల్లగా మారడం లేదా? ఈ నూనెతో ఏ రోజుల్లో మారడం ఖాయం..