Magnesium Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పోషకాలు, విటమిన్స్ కలిగిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటేనే శరీరం దృఢంగా యాక్టివ్ గా ఉంటుంది. పోషకాల్లో భాగంగా మెగ్నీషియం కూడా శరీరానికి తగినంత అవసరం. శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరం ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రతి రోజు మెగ్నీషియం అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది శరీరంలో పోషకాల లోపంతో పాటు మెగ్నీషియం కొరత కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా కండరాలలో సమస్యలు ప్రతిరోజు అలసట, నీరసం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
ప్రస్తుతం మెగ్నీషియన్ లోపం కారణంగా కండరాలలో కూడా తిమ్మిర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఈ తిమ్మిర్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మెగ్నీషియం లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో గోధుమలతో తయారుచేసిన పదార్థాలతో పాటు ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతిరోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం లోపం సమస్యలే కాకుండా శరీరంలో పోషకాల లోపం సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు ప్రతిరోజు తప్పకుండా ఆహారంలో వీటిని చేర్చుకోవాలి.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Magnesium Deficiency: కండరాల తిమ్మిర్లతో సతమతమవుతున్నారా? ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఇదే!