Shukra Gochar 2023: మే 02 నుండి ఈ రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Venus transit 2023: మే 02న శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. శుక్రుడి గోచారం కారణంగా ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 04:50 PM IST
Shukra Gochar 2023:  మే 02 నుండి ఈ రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra Gochar 2023: రేపు శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు వృషభరాశి నుండి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి గోచారం కొన్ని రాశులవారిపై సానుకూలంగా, మరికొన్ని రాశులవారిపై ప్రతికూలంగా ఉండనుంది. శుక్రుని సంచార సమయంలో ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం ఈ రాశులకు వరం
మేషం- శుక్ర సంచారం మేష రాశి వారికి మేలు చేయనుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. 
మిథునరాశి- మిథున రాశి వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.  
సింహ రాశి- మే 2న జరగబోయే శుక్ర సంచార సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ఆఫీసులో ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Budh-Shukra Yuti 2023: అరుదైన యోగాన్ని చేయబోతున్న బుధుడు-శుక్రుడు.. ప్రత్యేక ప్రయోజనం పొందబోతున్న రాశులివే.. 

తుల రాశి - శుక్రుడి గోచారం తులరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ధనప్రాప్తి కలుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
మీనం - శుక్ర సంచార ప్రభావం మీనరాశి వారిపై ప్రత్యేకంగా ఉంబోతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు ఈ సమయంలో శుభవార్త వింటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

Also Read: Chandra Grahan 2023: మరో 3 రోజుల్లో ఈ రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News