/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Weather Report: హైదరాబాద్‌ లో రెండు మూడు రోజుల క్రితం వరకు ఎండల వేడికి తట్టుకోలేక రోడ్ల మీదకు జనాలు వచ్చేందుకు బయపడ్డారు. కట్‌ చేస్తే గత రాత్రి నుండి హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. రెండు గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదు అయినట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అకాల వర్షంతో రాంచంద్రాపురం-7.98, గచ్చిబౌలి-7.75, గాజులరామారం-6.5, కుత్బుల్లాపూర్‌-5.55, జీడిమెట్ల -5.33 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదు అయింది. ఏప్రిల్‌ నెలలో ఇలాంటి వర్షాలు ఎప్పుడు చూడలేదని.. ఇంతటి నీరును హైదరాబాద్ రోడ్ల మీద ఎప్పుడు చూడలేదు అంటూ స్థానికులు పేర్కొన్నారు. 

భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పెద్ద ఎత్తున చెట్లు నెలకొరిగాయి. హోర్డింగ్ లు విరిగి పడటంతో పలు చోట్ల విద్యుత్‌ కి అంతరాయం కలిగింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాత్రంతా కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం తెల్లవారు జామున కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదు అవ్వడంతో విద్యుత్‌ పునరుద్దరణకు చాలా సమయం పట్టింది. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరత వల్ల సహాయక చర్యలు మెల్లగా సాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెలలో ఈ స్థాయిలో వర్షాలు నమోదు అవుతాయని ముందస్తుగా భావించని కారణంగా అధికారులతో పాటు జనాలు కూడా సిద్ధంగా లేకపోవడంతో సమస్య పెద్దగా అయ్యింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో అమీర్ పేట్‌.. బంజారా హిల్స్‌ రోడ్ నెం.12, కూకట్‌ పల్లి, మియాపూర్‌ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రహ్మత్‌ నగర్ డివిజన్‌ ఎస్పీఆర్‌హిల్స్ లో ఓం నగర్‌ లోని ఒక ఇంటి గోడ కూలి 8 నెలల చిన్నారి మృతి చెందింది. రాబోయే రెండు మూడు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Also Read: CM Jagan Mohan Reddy: నరమాంసం తినే పులి ముసలిదైపోయింది.. చంద్రబాబుపై సీఎం జగన్ ఓ రేంజ్‌లో కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
IMD warns to Telangana state today and tomorrow heavy rain expected in across Telangana state
News Source: 
Home Title: 

Weather Report: హైదరాబాద్ అతలాకుతలం.. మొన్నటి వరకు ఎండలు ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం

Weather Report: హైదరాబాద్ అతలాకుతలం.. మొన్నటి వరకు ఎండలు ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం
Caption: 
Weather Report (File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
హైదరాబాద్ అతలాకుతలం.. మొన్నటి వరకు ఎండలు ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 26, 2023 - 15:48
Request Count: 
35
Is Breaking News: 
No
Word Count: 
274