White Hair To Black Hair Naturally: తెల్ల జుట్టు కారణంగా చాలామంది అందహీనంగా కనిపిస్తున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిలోనూ తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా మరికొంతమందిలో జుట్టు రాలిపోవడం కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్లో లభించే హెన్నా కలర్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఫలితం పొందినప్పటికీ కొద్దిరోజులు మాత్రమే జుట్టు నల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎప్పటిలాగా తెల్లబడిపోతుందని బాధితులు చెబుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు సౌందర్య నిపుణులు సూచించిన కాఫీ హెయిర్ మాస్క్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ హెయిర్ మాస్క్ ని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు:
❋ కప్పు పెరుగు
❋ రెండు నుంచి మూడు టీ స్పూన్ల కాఫీ, టీ పౌడర్
❋ రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్
❋ రెండు టీ స్పూన్ల తేనె
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
ఈ హెయిర్ మాస్క్ తయారీ పద్ధతి:
❋ ఎయిర్ మాస్కులు తయారు చేయడానికి ముందుగా ఓ చిన్న గిన్నెను పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
❋ తర్వాత పైన పేర్కొన్న నాలుగు పదార్థాలను గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
❋ మిక్స్ చేసుకున్న పదార్థాలను 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
❋ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలోకి తీసుకొని వజ్రపరచుకుంటే కాఫీ హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే..
కాఫీ హెయిర్ మాస్క్ వినియోగించే పద్ధతి:
❋ కాఫీ హెయిర్ మాస్కులు వినియోగించే ముందు జుట్టును శుభ్రం చేసుకుని పొడిపొడిగా ఆరనివ్వాలి.
❋ ఆ తర్వాత మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లదాకా అప్లై చేయాలి.
❋ అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
❋ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రంగా చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
White Hair: తెల్ల జుట్టును 15 నిమిషాల్లో నల్లగా మార్చే కాఫీ హెయిర్ మాస్క్