White Hair Problem: ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడిపోతోంది. ఈ సమస్య చాలామందిలో కన్పిస్తోంది. జుట్టు నెరవడం వల్ల నలుగురిలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. అసలీ సమస్యకు కారణమేంటి, జెనెటిక్ కారణమా లేదా మరేదైనా ఉందా అనేది చూడాలి.
జుట్టు త్వరగా తెల్లబడటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. ఒకటి జెనెటిక్ అయితే రెండోది జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు. హెయిర్ డై కూడా మరో కారణం కావచ్చు. హెయిల్ డై వల్ల కేశాలు అసహజంగా, నిర్జీవంగా, ఎండిపోయినట్టు మారిపోతుంటాయి. తెల్లబడిన జుట్టు తిరిగి నల్లబడాలంటే ప్రకృతిలో లభించే కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో మూడు రకాల వస్తువులు కలిపి రాయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి.
కొబ్బరి నూనె-ఉసిరి మిశ్రమం
తెల్లజుట్టు సమస్య నుంచి విముక్తి పొందేందుకు కొబ్బరి నూనె ఉసిరి మిశ్రమంగా చాలా బాగా పనిచేస్తుంది. ఉసిరిలో చాలా రకాల న్యూట్రియంట్లు, ఆయుర్వేదిక్ గుణాలున్నాయి. ఉసిరి చర్మం సంరక్షణతో పాటు కేశాలకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో కొలాజెన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంటుంది. దాంతోపాటు ఐరన్, విటమిన్ సి కూడా ఉండటం వల్ల కేశాలకు బలం చేకూరుతుంది. 4 చెంచాల కొబ్బరి నూనెలో 2-3 చెంచాల ఉసిరి పౌడర్ కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత తలకు పట్టించాలి. కేశాలకు ఈ మిశ్రమాన్ని మస్సాజ్ చేస్తే చాలా లాభదాయకం. రాత్రంగా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే ఫలితాలు కన్పిస్తాయి.
కొబ్బరి నూనె-గోరింటాకు
కొబ్బరి నూనె కేశాలకు చాలా ప్రయోజనకరం. చాలా మంచిది. దీంట్లో గోరింటాకు కలిపి రాసుకుంటే హెయిర్ కలర్‌లా పనిచేస్తుంది. ముందుగా గోరింటాకుల్ని ఎండబెట్టి పౌడ్ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసుకోవాలి. ఇందులో గోరింటాకు పౌడర్ కలిపి గోరువెచ్చగా ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. దాదాపు అరగంట ఉంచిన తరువాత కేశాల్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నెరిసిన తల తిరిగి నల్లబడవచ్చు.
Also read: Eating Curd: ఈ పదార్థాలతో పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook