Winter Weight & Diabetes Tips: ఇలా చేస్తే చాలు.. చలికాలపు అధిక బరువు, డయాబెటిస్ సమస్యలను 30 రోజుల్లో దూరం చేయొచ్చు!

Morning Walking In Winter For Weight Loss: చలి కాలంలో ప్రతి రోజూ వాకింగ్‌ చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట వ్యాయామాలు, వాకింగ్‌ చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడం, మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 02:50 PM IST
  • చలి కాలంలో రాత్రి ఇలా వాకింగ్ చేస్తే
  • అధిక బరువు, మధుమేహం..
  • సమస్యలు శాశ్వతంగా దూరం..
Winter Weight & Diabetes Tips: ఇలా చేస్తే చాలు.. చలికాలపు అధిక బరువు, డయాబెటిస్ సమస్యలను 30 రోజుల్లో దూరం చేయొచ్చు!

Morning Walking In Winter For Weight Loss: చలికాలంలో చాలా మంది లేజీగా ఉంటారు. అంతేకాకుండా చాలా మంది చాలి కారణంగా 8 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతారు. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆహారాలు తీసుకోవటంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని వారు చెబుతున్నారు. లేకపోతే సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మంది చలి కాలంలో వాకింగ్‌ చేయడం మానుకుంటున్నారు. దీని వల్ల కూడా శరీర సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి చలి కాలంలో కూడా వ్యాయామాలు, వాకింగ్‌ చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

1. లేజీనెస్‌ తగ్గుతుంది:
చలి కారణంగా చాలా మంది బద్ధకంగా తయారవుతారు. అయితే లేజీనెస్‌ను వదిలించుకునేందుకు ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామాలు, వాకింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి చలి కాలంలో మార్నింగ్‌ నిద్ర లేచి వాకింగ్‌ చేయండి.

2. చలి తగ్గించుకోవడానికి ఇలా చేయండి:
ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్న వారు తప్పకుండా శరీరానికి వెచ్చదనం అందించేందుకు  వెచ్చని బట్టలు ధరించాలి. అంతేకాకుండా చేతులకు చేతి తొడుగులు కూడా వినియోగించాల్సి ఉంటుంది.

3. రాత్రిపూట నడవడం వల్ల కలిగే ప్రయోనాలు:
మార్నింగ్ పూట నడవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ రాత్రి పూట నడవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాత్రి తిన్న తర్వాత 10 నుంచి 20 నిమిషాల పాటు నడవడం ఆరోగ్యాని చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు చలి కాలంలో ప్రతి రోజూ ఇలా నడవడం సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గి మధుమేహం కూడా నియంత్రణంలో ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Shweta Basu Prasad Hot Photos: వ్యభిచారం కేసులో పట్టుబడిన శ్వేతాబసు ప్రసాద్ ఇప్పుడెలా ఉందో చూశారా?

Also Read: Ira Khan Engaged: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ నుపుర్ తో అమీర్ ఖాన్ కూతురి ఎంగేజ్మెంట్.. మాజీ భార్యలే కాదు ఆమె కూడా వచ్చిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News