Weight Loss Diet Plan: వానా కాలం కారణంగా చాలా మంది త్వరగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే కేవలం వీరు అనారోగ్యకరమై ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆహారపు అలవాట్ల వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నం కావడం విశేషం. అయితే ఈ తేమ వాతావరణం క్రమంలో ఆకు కూరలను తినకపోవడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో బరువు తగ్గడానికి సరైన డైట్ ప్లాన్ పాటించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ల నుంచి సంరక్షిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే వానా కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవడం బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే వానా కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే తేమ కలిగిన ఆహారం తీసుకోవడం శరీరంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కావున బరువు నియంత్రించుకునేందుకు ఆహార సమతుల్యంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్లే శరీరంలో చెడు కొవ్వు నియంత్రణలో ఉండి.. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గడానికి రోజూ ఈ డైట్ ప్లాన్‌ను అనుసరించండి:
1) బరువు తగ్గడానికి ఉదయం పూట టీఫిన్‌లో ఏం తీసుకోవాలి:
వానా కాలంలో చాలా మంది ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రైడ్ రోస్ట్‌ను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. బరువును నియంత్రించుకోవాలనుకునే వారు తప్పకుండా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి పోహా, ఉప్మా, ఇడ్లీ, టోస్ట్, పరాఠాలు తినవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరాన్ని దృఢంగా చేస్తాయి. కావున త్వరలోనే బరువు తగ్గుతారు. అయితే బరువును నియంత్రించేందుకు బ్లాక్ కాఫీ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.
2) మధ్యహ్నం లంచ్‌లో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి:
వానాకాలంలో చాలా మందిలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వేయించిన ఆహారానికి బదులుగా.. సాధారణ పప్పు, కూరగాయలు, రోటీ, సలాడ్ తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంతో పాటు పెరుగు, మజ్జిగ కూడా తీసుకోవచ్చు.
3) కొవ్వు తగ్గాలంటే రాత్రి భోజనంలో వీటిని తినండి:
రాత్రి భోజనం ఎల్లప్పుడూ తేలికగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అయితే వానా కాలంలో కూడా ఇలాంటి పద్ధతిని అనుసరించాలి. కావాలంటే ఆహారంలో సూప్‌లను కూడా తాగవచ్చు. అంతేకాకుండా వోట్స్ లేదా సాల్టెడ్ గంజిని కూడా తయారు చేసుకోని ఎనర్జీ డ్రింక్‌గా తాగొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం మర్చిపోకండి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరడి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన
Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook