Weight Loss Control Diet: ప్రతి రోజు ఎక్కువ సమయం ఆఫీసులో కూర్చొని పనులు చేయడం, ఒత్తిడి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా మంది సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఊబకాయం సమస్యలతో బాధపడేవారు సులభంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. కొంతమంది అయితే తీవ్ర గుండె సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బరువు పెరుగుతున్న వారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నియంత్రించుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి చాలామంది కఠినతర వ్యాయామాలతో పాటు డైట్లను కూడా అనుసరిస్తున్నారు. ఇలా అనుసరించడం వల్ల కొన్ని రోజుల పాటు బరువు తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటే తప్పకుండా డైట్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని ప్రత్యేకమైన చిరుధాన్యాలను డైట్ లో తీసుకోవాల్సి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
క్వినోవా:
క్వినోవాలో శరీరానికి కావాల్సిన అధిక పరిమాణంలో ప్రోటీన్స్ లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు డైట్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతోపాటు క్వినోవాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బార్లీ:
బార్లీలో అధిక పరిమాణంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీనిని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టైప్ టు డయాబెటిస్ తో బాధపడుతున్న వారు బార్లీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్:
ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు డైట్ లో తీసుకోవడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అంతే కాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రౌన్ రైస్:
చాలామంది ఎక్కువగా వైట్ రైస్ ను తింటూ ఉంటారు.. దానికి బదులుగా బ్రౌన్ రైస్ ను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా మధుమేహాన్ని కంట్రోల్ కూడా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక మోతాదులో ఫైటిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగిపోతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి