Valentine's Day: ప్రేమికుల రోజు వచ్చిందంటే.. చాలా మంది అనుకునే విషయం ఏమిటంటే లవర్స్ మాత్రమే ఈ రోజును సెలెబ్రెట్ చేసుకుంటారు అని. కానీ చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. సింగిల్స్ కూడా ఈ రోజును హ్యాపీగా జరుపుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
ప్రతి వ్యక్తికి తనపై తనకు ప్రేమ ఉండటం చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరు తమను తాము ప్రేమించుకున్నంత ఎక్కువగా ఇంకెవరిని ప్రేమించరు. అందుకే మీకోసం మీరు ఈ రోజును కేటాయించండి.
ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకునేందుకు సింగిల్‌గానే ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయండి. ట్రిప్‌కు వెళ్లేంత టైమ్ లేకుంటే.. సినిమా, లంఛ్ వంటివి కూడా చేయొచ్చు.
స్పెషల్ గిఫ్ట్..
అదేమింటి సింగిల్‌గా ఉంటే గిఫ్ట్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఎవరూ గిఫ్ట్ ఇవ్వకున్నా మీరు ఏదైనా వస్తువును కొనాలుకుని చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తుంటే.. దానిని ఈ రోజు పూర్తి చేయండి. అలా చేస్తే మీకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారుతుంది. మరీ ముఖ్యంగా మీరు కొనాలనుకుంటున్న వస్తువు మీకు దక్కుకుంది.
రీఫ్రెష్ అవ్వండి..
ప్రతి రోజు మీరు బిజీ లైఫ్‌లో జీవిస్తుంటే.. ఈ రోజు మాత్రం మీకోసం కాస్త సమయం కేటాయించుకోండి. ముఖ్యంగా పని ఒత్తిడి నుంచి రీఫ్రెష్ అయ్యే పనులు చేయండి.
ఇంకా మంచి సమయాన్ని గడిపేందుకు మీకు ఇష్టమైన పనులు చేయండి. ఈ రోజు మొత్తం మీరు పూర్తి స్వేచ్ఛగా జీవించండి. దీనితో కచ్చితంగా మీరు సింగిల్‌గా ఉన్నా ఆనందంగా గడుపుతారు.
స్నేహితులను కలవచ్చు..
వాలెంటైన్స్ డే అంటే.. ప్రేమికులు మాత్రమే జరుపుకోవాలనే రూల్ ఎక్కడ లేదు. అందుకే సింగిల్‌గా ఉంటే.. ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్‌తో సరదాగా టైమ్ గడపొచ్చు. అందరు కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, సినిమాలు చూడటం, టిప్స్ ప్లాన్ చేయడం కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి.
Also read: Valentine Day 2022: వాలెంటైన్స్ డే రోజున మీరు సింగిల్ గా ఉన్నారా? అయితే ఇవి చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook