How To Make Skin Brightening Solution: కాలుష్యం కారణంగా చాలా మంది చర్మ, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా మందిలో వాతావరణంలో మార్పులు కారణంగా చర్మం టాన్‌గా మారుతోంది. దీని కారణంగా చర్మం అందహీనంగా తయారవుతుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మార్కెట్ లభించే చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యలన్నింటికీ కలబంద, పసుపు, తేనె సహాయంతో తయారు చేసిన స్కిన్ బ్రైటెనింగ్ సొల్యూషన్ ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని వినియోగించడం వల్ల చర్మం మృదువుగా, మెరిస్తూ తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని ఎలా తయారు చేయాలో, ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్కిన్ బ్రైటెనింగ్ సొల్యూషన్‌కు కావలసిన పదార్థాలు:
దీనిని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
అందులో అలోవెరా జెల్, పసుపు పొడిని వేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అందులో తేనె వేసి మిశ్రంగా చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీ చర్మాన్ని కాంతివంతం చేసే సొల్యూషన్ సిద్ధమయినట్లే..
స్కిన్ బ్రైటెనింగ్ సొల్యూషన్‌ని ఇలా వినియోగించాలి:
దీనిని వినియోగించడానికి ముందుగా చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
తర్వాత ముఖానికి మిశ్రమాన్ని బాగా పట్టించాల్సి ఉంటుంది.
ముఖానికి అప్లై చేసి తర్వాత 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి.
తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Honey Rose Pics : బాప్ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ
Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook