How To Make Kheera Face Toner: దోసకాయను సూపర్ ఫుడ్‌గా భావిస్తారు. ఎందుకంటే ఇందులో 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా మారుతుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచే కాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దోసకాయను ఫేస్ టోనర్‌గా తయారు చేసి చర్మాన్నికి వినియోగించడం వల్ల చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దోసకాయలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి దోసకాయ ఫేస్ టోనర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
దోసకాయ ఫేస్ టోనర్ చేయడానికి కావలసిన పదార్థాలు:
- దోసకాయ 1
- అలోవెరా జెల్ తాజా
- అర లీటరు నీరు
దోసకాయ ఫేస్ టోనర్ తయారి విధానం:
- ఈ ఫేస్ టోనర్ తయారి చేయడానికి ముందుగా 1 దోసకాయ తీసుకోవాలి.
- ఈ దోసకాయ గ్రైండ్ చేసి అందులోంచి రసాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి.
- అందులో కలబంద మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని లీటరు నీరు వేసి కలపాలి.
- ఆ తర్వాత టోనర్‌ను స్ప్రే బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.
- ఇలా పక్కన తయారు చేసుకుంటే దోసకాయ ఫేస్ టోనర్‌గా సిద్ధంగా ఉన్నట్లే..
ఫేస్ టోనర్ వినియోగించే పద్ధతి:
- ఖీరా ఫేస్ టోనర్ అప్లై చేసే ముందు.. మీ ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
- తర్వాత ముఖానికి స్ప్రే బాటిల్ సహాయంతో టోనర్ అప్లై చేయాలి.
- ఇలా క్రమం తప్పకుండా చేస్తే తక్షణమే మీ చర్మాన్ని మెరిపించుకోవచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook