Why You Should Not Drink Milk At Night: పాలు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే పాలను నిపుణులు సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అయితే పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ బి పోషకాలు అందుతాయి. దీంతో శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా శరీర అకృతిని పెంచడానికి కూడా పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం చాలా మంది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రాత్రి పూట పాలను తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రజల్లో అపోహలు కూడా వస్తున్నాయి. ఇంతకు రాత్రి పూట పాలను తాగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాత్రిపూట పాలు ఎందుకు తాగకూడదు?:
అమెరికాలోని కాలిఫోర్నియాలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ విభాగానికి చెందిన డాక్టర్ పళనియప్పన్ మాణికం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పంచుకున్నారు. రాత్రి పూట పాలను తాగడం వల్ల 30 ఏళ్లు పైబడిన వారిలో లాక్టేజ్ ఎంజైమ్ లోపం క్రమంగా మొదలవుతుందని.. దీని వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేగులలో లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోయి.. గెలాక్టోస్ విచ్ఛిన్నం కావడంతో శోషణలో సమస్యలు వస్తాయని వారు పేర్కొన్నారు.
జీర్ణక్రియపై ప్రభావం:
రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల చాలా సులభంగా జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలా రాత్రి పడుకునేవారు పాలు తాగడం మానుకోవాలని డాక్టర్ పళనియప్పన్ మాణికం అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో జీర్ణ క్రియ సమస్యలే కాకుండా నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. కాబట్టి ఇలా రాత్రి పూట కాకుండా ఉదయం పూట పాలను తాగడం శరీరానికి చాలా మంచిదని సూచిస్తున్నారు .
ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి:
అంతేకాకుండా చాలా మంది రాత్రి పూట ఆహారాలు తీసుకున్న వెంటనే పాలు తాగుతున్నారు. ఇలా తాగడం హానికరమని డాక్టర్ పళనియప్పన్ మాణికం తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పాలు తాగాలనుకునేవారు తప్పకుండా నిద్రపోయే 4 గంటల ముందు తాగాల్సి ఉంటుంది.
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook