Weight Loss: ఈ హెర్బల్‌ టీతో దెబ్బకు 10 రోజుల్లో బరువు దిగి రావడం ఖాయం..

Herbal Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని బరువు పెరుగుతున్నారు. అయితే బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. సులభంగా బరువు తగ్గడానికి నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 06:54 PM IST
Weight Loss: ఈ హెర్బల్‌ టీతో దెబ్బకు 10 రోజుల్లో బరువు దిగి రావడం ఖాయం..

Herbal Tea For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం పొందలేకపోతున్నారు. అయితే ఈ శరీర బరువు నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే శరీర బరువు తగ్గడానికి పలు ఆయుర్వేద మూలికలను ఉపయోగించి తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. అయితే ఈ టీని తాగడం వల్ల బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అల్లం టీని ఎలా తయారు చేయాలో తెలుసా..?:
అల్లం టీలో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాలను సులభంగా నియంత్రిస్తాయి. దీంతో బెల్లీ ఫ్యాట్‌ సులభంగా తగ్గుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.అయితే ఈ హెర్బల్ టీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావలసినవి:
1/2 కప్పు నీరు 
1/2 కప్పు కప్పు పాలు
1 టీస్పూన్ టీ ఆకులు
1 టీస్పూన్పసుపు లేదా అల్లం పొడి 
1/2 టీస్పూన్ చిన్న యాలకులు 
1/2 టీస్పూన్ లవంగాలు లేదా లవంగాల పొడి 

టీ తయారుచేసే విధానం:
ముందుగా స్టవ్‌ పై బౌల్‌ పెట్టాలి. ఆ తర్వాత అందులో పైన మోతాదులో పేర్కొన్న నీటిని(1/2 కప్పు నీరు) పోయాల్సి ఉంటుంది.అందులోనే పాలను వేసి మరిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పైన సూచించిన అన్ని పదార్థాలను వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగిన టీలో రుచి రెట్టింపు చేసుకునేందుకు తేనెను వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్వ్‌ చేసుకుని తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా శరీర బరువు హెల్తీగా తగ్గుతారు. 

అల్లం టీ బరువును ఎలా తగ్గిస్తుంది?:
ఈ అల్లం టీని ప్రతి రోజూ రెండు పూట తాగితే జీర్ణక్రియ సమస్యలు సులభంగా తగ్గిపోవడమేకాకుండా వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాకుండా శరీరానికి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్, ఫైబర్, సోడియం లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఈ టీని రెండు పూటలు తాగాల్సి ఉంటుంది. ఇలా తాగితే త్వరలోనే ఫలితం పొందుతారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!

Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News