Health Benefits Of Garlic Peel: ఆహారాల రుచిని మెరుగుపరిచేందుకు, అద్భుతమైన వాసనను అందించేందుకు వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఆహారాల్లో వీటిని వినియోగిస్తారు. ప్రతి రోజు వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే చాలా మంది వీటిని వినియోగించే క్రమంలో దీనిపై తొక్కను పడేస్తూ ఉంటారు. నిజానికి ఇవి కూడా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో తొక్కల్లో ఉండే గుణాలు వాపులు, నొప్పుల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇవేకాకుండా ఈ వెల్లుల్లి తొక్క వల్ల కలిగే ఇతర లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెల్లుల్లి పీల్స్‌లో ఉండే పోషకాలు ఇవే:
వెల్లుల్లి పీల్స్‌లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్‌లు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఫీల్స్‌ను పొడిలా తయారు చేసి పిజ్జా, శాండ్‌విచ్‌లపై మసాలా లాగా వాడితో రుచితో పాటు ఆరోగ్యం కూడా పొందుతారు. అంతేకాకుండా పొట్ట ఉబ్బరం, పాదాల నుంచి విముక్తి కలుగుతుంది.
చర్మ సమస్యలకు చెక్:
దురద, తామర వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వెల్లుల్లి తొక్కలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీని కోసం ఈ తొక్కలను నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టి మిశ్రమంలా తయారు చేసుకుని చర్మ సమస్యలు గల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి నీటితో శుభప్రదం చేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ రెమెడీ అనేక రకాల చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల సమస్యను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
ఆస్తమా రోగులకు..:
వెల్లుల్లి తొక్కలు ఆస్తమా రోగులకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. దీని కోసం ప్రతి రోజు ఉదయం పూట వెల్లుల్లి తొక్కలను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కూడా కలుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
జుట్టు సమస్యలు:
జుట్టు సమస్యలతో బాధపడేవారికి కూడా వెల్లుల్లి తొక్కలు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తలలో పేను, చుండ్రు సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా దీనిని మిశ్రంలా తయారు చేసి జుట్టుకు అప్లే చేసి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇవే ప్రయోజనాలు కాకుండా ఈ వెల్లుల్లి పొట్టును వినియోగించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి