Coconut Oil In Coffee: కాఫీ ని ప్రతిరోజు తాగడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే బెడ్ కాఫీ తోని మొదలుకొని సాయంత్రం వరకు కాఫీలు తాగుతూనే ఉంటారు. ఒకటి రెండు కాదు ప్రతిరోజు 4 నుంచి 5 వరకు కాఫీలు తాగే వారు కూడా ఉన్నారు. ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడి, ఆందోళన దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కాఫీలో కొబ్బరి నూనెను కలుపుకొని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం పూట ఒక కప్పు కాఫీలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలుపుకొని తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా కాఫీ కొబ్బరి నూనె మిక్స్ చేసుకొని తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతోపాటు బ్యాక్టీరియా కూడా సులభంగా నశిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని తాగడం వల్ల మెదడు కూడా సులభంగా మెరుగుపడుతుంది. దీని కారణంగా ఏకాగ్రత పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెదడులోని నరాలను దృఢంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. తరచుగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్న వారు కాఫీ కొబ్బరి నూనె కలిపి తీసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్తో బాధపడుతున్న వారికి కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా డిప్రెషన్ను తగ్గించి మానసిక స్థితిని కూడా మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి