Cardamom Tea Benefits: ఆయుర్వేద శాస్త్రంలో యాలకులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆహారాల్లో యాలకులను ప్రతి రోజు వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ముఖ్యంగా యాలకులతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడేవారికి ఈ టీ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇతర సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.
యాలకుల టీ తాగడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణ వ్యవస్థకు మేలు:
యాలకుల్లో శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే అనేక రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు యాలకులతో తయారు చేసిన టీని తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
శ్వాసకోశ ఆరోగ్యం:
యాలకులు టీ తాగితే శ్వాసకోశ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఆస్తమా, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ యాలకుల టీ తాగాల్సి ఉంటుంది.
రోగ నిరోధక శక్తి:
యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టీ తాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఒత్తిడి తగ్గింపు:
యాలకుల టీ శరీర ఒత్తిడిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది మనోధైర్యాన్ని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యం:
యాలకులు రక్తపోటును నియంత్రించే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.