White Hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Black Hair Natural Dye: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు చిన్న వయసులోనే తెల్లగా మారుతోంది. అయితే ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌ లభించే వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.

Last Updated : Aug 10, 2022, 07:05 PM IST
  • తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..
  • బ్లాక్ టీతో చెక్‌ పెట్టొచ్చు
  • మెహందీని, కాఫీని కూడా వినియోగించవచ్చు
White Hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Black Hair Natural Dye: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు చిన్న వయసులోనే తెల్లగా మారుతోంది. అయితే ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌ లభించే వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. దీని వల్ల జుట్టు రాలిపోవం, జట్టు చిట్లి పోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలున్నాయి. వాటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు అందంగా, మృదువుగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుతుంది.

తెల్ల జుట్టు ఇలా చెక్ పెట్టండి:

బ్లాక్ టీ:
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బ్లాక్ టీ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. పూర్వీకులు ఈ పద్దతి ద్వారానే జుట్టును నల్లగా చేసుకునే వారని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.  బ్లాక్ టీని జుట్టుకి అప్లై చేయడం వల్ల సహజంగా నల్లగా మారుతుంది. అయితే దీనిని జుట్టుకు అప్లై చేసి.. కనీసం ఒక గంట పాటు ఉంచండి. ఆపై మీ జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.

కాఫీ:
బ్లాక్ టీతో పాటు మెహందీని, కాఫీని కూడా వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం.. ముందుగా ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను కప్పు నీటిలో కలిపి మరిగించాలి. కాఫీ చల్లగా అయ్యాక ఈ నీళ్లలో హెన్నా మిక్స్ చేసి మిశ్రమంలా చేయాలి. దీనిని జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మంచి నీటి శుభ్రం చేయాలి.

ఉసిరి:
ఉసిరిలో జుట్టును బలంగా చేసే ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ఇది జుట్టును పోడువగా చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టును నల్లగా చేస్తాయి. దీని కోసం ఉసిరి పొడిని తీసుకుని.. దానిలో మెంతి గింజల పొడిని నీటితో మిక్స్ చేసి.. జుట్టుకు ఒక గంట పాటు ఉంచి, తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. స్కాల్ప్, హెయిర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ఆమోదించదు.)

Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!

Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News