Best Hair Oil For Hair Growth: ప్రస్తుతం చాలా మంది స్త్రీలు పొడవాటి జుట్టును పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రోడక్ట్స్ కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచించి ఈ కింది నూనెలతో జుట్టుకు ప్రతి రోజు మసాజ్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్, ఒత్తైన జుట్టును పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు ఏయే నూనెలు కీలక పాత్ర పోషిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పొడవాటి జుట్టును పొందడానికి హెయిర్ ఆయిల్స్ వినియోగించండి:
కొబ్బరి నూనె:
ఈ నూనెలో జుట్టుకు అవసరమైన చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, బ్యాక్టీరియా, ఫంగస్ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు చిట్లడం సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టును మృదువుగా, సిల్కీగా చేసుకోవడానికి తప్పకుండా ఈ నూనెను వినియోగించాల్సి ఉంటుంది.
బృంగరాజ్ నూనె:
ఆయుర్వేద శాస్త్రంలో బృంగరాజ్ నూనె ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించారు. ఇందులో ఉండే మూలకాలు జుట్టు పెరుగదలను రెట్టింపు చేస్తుంది. బృంగరాజ్‌లో మెగ్నీషియం, ఐరన్ విటమిన్ డి, ఇ లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు జుట్టుకు అప్లై చేస్తే.జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
ఆముదం:
ఆముదం నూనె కూడా జుట్టుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ ఇ, ప్రొటీన్లు, మినరల్స్ లభిస్తాయి. కాబట్టి తలపై రక్త ప్రసరణను మెరుగుపరచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనె అప్లై చేయాలి.
హొహొబ నూనె:
హొహొబ నూనెలో ఉండే మూలకాలు జుట్టుకు లోతైన పోషణను ఇస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో హైపో అలెర్జెనిక్ లక్షణాలు కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. తీవ్ర జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ఆలివ్ నూనె:
ఈ నూనె కూడా జుట్టును దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఇ, ఒలియిక్ యాసిడ్ రాలిపోయిన జుట్టును పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Best Hair Oil For Hair Growth: ఈ నూనెలతో తెల్ల జుట్టు సమస్యలు తగ్గడమేకాకుండా అన్ని రకాల సమస్యలకు చెక్!