Benefits of Carrot Juice: మనం హెల్తీగా ఉండాలంటే.. రోజూ ఆరోగ్యకరమైన పుడ్ తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే మనకు ఎటువంటి జబ్బులు రావు. క్యారెట్ హెల్త్ కు చాలా మంచిది. దీనిని కూరగా, జ్యూస్, సలాగ్ గా రకరకాల రూపంలో తీసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని గ్రేటర్ నోయిడాలోని జిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ చెప్పారు. క్యారెట్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఫైబర్ , విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి మరియు అనేక ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
** మీరు క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ముఖానికి మెరుపు మరియు నిగారింపు వస్తుంది.
** మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే.. క్యారెట్ జ్యూస్ మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని తీసుకుంటే అన్ని పాత మరియు మొండి మొటిమలను పోతాయి.
** క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
** చిగుళ్ల నుంచి రక్తం కారుతున్న వారు తప్పనిసరిగా క్యారెట్ జ్యూస్ తాగాలి. దీంతో దంతాలకు మెరుపు కూడా వస్తుంది.
** దగ్గు ఆగకపోతే క్యారెట్ జ్యూస్‌లో ఎండుమిర్చి, పంచదార కలిపి తీసుకోవడం మంచిది.
** జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో, బరువును తగ్గించడంలో క్యారెట్ జ్యూస్ సూపర్ గా పనిచేస్తుంది.
Also Read: Skin Care Tips: ముఖంపై ముడతలు పోయి కళకళలాడాలంటే రోజూ ఇది వాడాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook