పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ లోనే ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ స్పష్టం చేశారు. అయితే ఎప్పుడు అనేదీ తేదీ ఇంకా ఖరారుకాలేదు. బహుశా డిసెంబర్ 15 నుండి ప్రారంభం కావచ్చు. డిసెంబర్ 15 నుండి జనవరి 2 వరకు సమావేశాలు జరుగుతాయి అని ప్రభుత్వ వర్గాల సమాచారం.
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున సమావేశాలు ఆలస్యంగా ప్రారంభిస్తున్నాము. సమావేశాలు ఆలస్యమయ్యాయి అని ప్రతిపక్షాలు అనటం హాస్యాస్పదం. 2008, 2013లో డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరిగాయని గుర్తించుకోవాలి" అని ఒక కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్, ఐబీసీ దివాళా చట్టం తదితర అంశాలపై ఈ శీతాకాల సమావేశంలోనే చర్చించనున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.