గుజరాత్ సీఎం అభ్యర్థి రేసులో షా, రూపానీ పేర్లు?

గుజరాత్ లో అధికారాన్ని నిలబెట్టుకున్న తరువాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి పరిశీలకులుగా నియమించారు.

Last Updated : Dec 19, 2017, 12:34 PM IST
గుజరాత్ సీఎం అభ్యర్థి రేసులో షా, రూపానీ పేర్లు?

గుజరాత్ లో అధికారాన్ని నిలబెట్టుకున్న తరువాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి పరిశీలకులుగా నియమించారు. బీజేపీ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ రూపానీని కొనసాగుతారని వార్తలు వచ్చినప్పటికీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

ఆగస్టు 2016లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ స్థానంలో విజయ్ రూపానీ నియమితుడయ్యారు. రాష్ట్రంలో పాటీదార్ ఆందోళన, దళిత ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడంలో రూపానీ విఫలమయ్యారని ప్రచారంలో ఉంది. సూరత్, దక్షిణ గుజరాత్ లో పాటీదార్లు బిజెపికి ఓటు వేయకుండా యథాతథంగా ఉండిపోయారు. అయితే, సౌరాష్ట్రలోని పాటీదార్ల ఓట్లతో కాంగ్రెస్ పట్టు సాధించింది. 
  
ఇక గుజరాత్ సీఎం రేసులో ఉన్న మరో వ్యక్తి పేరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఈయన ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తి, నమ్మిన బంటు.  బహుశా.. మోదీ తలుచుకుంటే ఈయనే గుజరాత్ ముఖ్యమంత్రి కావచ్చు. అయితే, 2019 రాష్ట్ర ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని షా బీజేపీ అధ్యక్షుడిగా ఢిల్లీలో ఉంటేనే బాగుంటుందని బీజేపీ పెద్దల్లో కొందరు కోరుకుంటున్నారు. షా నేతృత్వంలోని బీజేపీ మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్, అస్సాం, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గెలిచింది. ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించడంలో షా కీలక పాత్ర పోషించారు. 

అమిత్ షా  1997లో జరిగిన ఉప ఎన్నికలలో సర్ఖేజ్ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత షా, 1998, 2002 మరియు 2007లో వరుస విజయాలను సాధించారు. 

ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న మరో అభ్యర్థి. ఆనందిబెన్ పటేల్ పదవీ విరమణ చేసిన తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీదారుగా ఉన్నారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితు వాఘాని పేరు కూడా  సీఎం రేసులో ఉన్న మరో పేరు. పీటీఐ నివేదిక ప్రకారం, కొన్నిరోజుల్లో గుజరాత్ కు పరిశీలకులు వస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. "ఎమ్మెల్యేలు వారి అభ్యర్థులను ప్రతిపాదిస్తారు. ఒక ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు లేదా ఐదు రోజులు పడుతుంది" అని పేర్కొన్నారు.

Trending News