126 అవసరమైతే.. 36 ఎందుకు కొన్నారు: మోదీ సర్కారుకి కాంగ్రెస్ సూటిప్రశ్న

కాంగ్రెస్ అధిష్టానం మోదీ సర్కారుకి సూటిప్రశ్న వేసింది. 126 ఫైటర్ జెట్స్ అవసరమైనప్పుడు ఫ్రాన్స్ డాసాల్ట్ ఏవివేషన్ సంస్థ నుండి కేవలం 36 ఎయిర్ క్రాఫ్టులు కొనడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని కాంగ్రెస్ పార్టీ అడగడం గమనార్హం. 

Last Updated : Sep 3, 2018, 11:24 AM IST
126 అవసరమైతే.. 36 ఎందుకు కొన్నారు: మోదీ సర్కారుకి కాంగ్రెస్ సూటిప్రశ్న

కాంగ్రెస్ అధిష్టానం మోదీ సర్కారుకి సూటిప్రశ్న వేసింది. 126 ఫైటర్ జెట్స్ అవసరమైనప్పుడు ఫ్రాన్స్ డాసాల్ట్ ఏవివేషన్ సంస్థ నుండి కేవలం 36 ఎయిర్ క్రాఫ్టులు కొనడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని కాంగ్రెస్ పార్టీ అడగడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ప్రభుత్వం ఎందుకు ఆ విదేశీ సంస్థను ఎయిర్ క్రాఫ్టులు అన్నింటినీ ఒకేసారి అందించమని అడగలేదని ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందం పై విమర్శలు వస్తున్న క్రమంలో బీజేపీ ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడిగే ప్రశ్నలకు భయపడుతుందని.. అందుకే ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదని ప్రియాంక విమర్శలు గుప్పించారు. "ఒప్పందం ప్రకారం మనకు చేరాల్సినవి 126 ఎయిర్ క్రాఫ్టులు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం 35 ఎయిర్ క్రాఫ్టుల కోసమే డీల్ సంతకం చేసింది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదీ మన ప్రభుత్వం పరిస్థితి" అని ప్రియాంక తెలిపారు. ఓ మిలియనీర్ స్నేహితుడి కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు. 

"ఒక్కో విమానం ఖరీదు తొలుత రూ.526 కోట్లు అని తెలిపారు. అయితే తర్వాత అదే మొత్తం రూ.1670 కోట్లుగా ఎలా మారింది? మన ప్రభుత్వం 70 సంవత్సరాల అనుభవం కలిగిన సంస్థను పక్కనపెట్టి కేవలం 12 సంవత్సరాల అనుభవం కలిగిన కంపెనీకి కాంట్రాక్టుని ఎందుకు కట్టబెట్టింది అన్న విషయం కూడా తెలపాలని డిమాండ్ చేస్తున్నాం"  అని ప్రియాంక చతుర్వేది తెలిపారు. భారత వైమానిక బలాన్ని పెంపొందించడానికి యుద్ధ విమానాలు కొనాలని 2000లో వాజ్‌పేయి హయాంలోనే సర్కారు నిర్ణయించింది. అయితే అందుకు తగ్గ ప్రతిపాదనలు మాత్రం యూపీఏ హయాంలో సిద్ధమయ్యాయి. ఈ కాంట్రాక్టు దక్కించుకోవడానికి అనేక అగ్రశ్రేణి కంపెనీలు పోటీ పడ్డాయి.

ఆఖరికి రాఫెల్‌, టైఫూన్‌ విమానాలను కొనాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.  ఆ తరవాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి చెంది... మోదీ సర్కారు బాధ్యతలు స్వీకరించాక.. పాత ఒప్పందాలను రద్దు చేశారు. కేవలం 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు ఫ్రాన్స్‌ పర్యటనలో మోదీ ఆకస్మికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌తో మోదీ సర్కారు చేసుకున్న ఒప్పందం గురించి.. పాత ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారన్న విషయం గురించి వివరణ ఇవ్వమని కాంగ్రెస్ కోరింది. అయితే రాఫెల్‌ డీల్‌ అంశాలు రహస్యంగా ఉంచాలని ఫ్రాన్స్‌తో ఒప్పందం ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలపడంతో ఈ అంశం వివాదమైంది. 

Trending News