Telangana Formation Day: ఢిల్లీలో తెలంగాణ సంబురం..పాల్గొననున్న అమిత్ షా..!

Telangana Formation Day: తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. 

Written by - Alla Swamy | Last Updated : Jun 2, 2022, 11:00 AM IST
  • ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
  • జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
  • తొలిసారి ఢిల్లీలో అవతరణ సంబరాలు
Telangana Formation Day: ఢిల్లీలో తెలంగాణ సంబురం..పాల్గొననున్న అమిత్ షా..!

Telangana Formation Day: తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోనూ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. 

తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీలోని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఉత్సవాలు జరుగుతాయి. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మీనాక్షి లేఖి ఉత్సవాల్లో పాల్గొంటారు. వేడుకల్లో ప్రముఖ గాయని మంగ్లీ, గాయకుడు హేమ చంద్ర ప్రదర్శనల ఉంటాయి. 

తెలంగాణకు చెందిన జానపద నృత్యకారులు, ఢిల్లీ కథక్‌ కేంద్రానికి చెందిన కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఇటు తెలంగాణవ్యాప్తంగా అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు, నేతలు పాల్గొంటున్నారు.

Also read:Bharatsinh Solanki Issue: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కాంగ్రెస్‌ నేతకు బడితపూజ..అసలేమి జరిగిందంటే..!

Also read:Divyavani Resign: టీడీపీకి దివ్య వాణి రాజీనామా..త్వరలో ఆ పార్టీ గూటికేనా..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News