Suvendu Adhikari sensational comments on Kolkata doctor rape and murder case incident: కోల్ కత్తా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశంలో పెనుదుమారంగా మారాయి. ఈ ఘటనపై ప్రస్తుతం దేశంలో నిరసలను మిన్నంటాయి. ఈ నేరానికి పాల్పడిన వారిని ఉరితీయాలని కూడా డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ అపోసిషన్ లీడర్, బీజేపీ నేత.. ఎక్స్ వేదికగా షాకింగ్ ట్విట్ చేశారు. ఆయన కోల్ కతా ఘటనపై స్పందిస్తూ... ఆర్ జీ కర్ ఆస్పత్రిలో.. ఆగస్టు 9 హత్యాచార ఘటన తర్వాత యువతి మృతదేహాన్ని సెమినార్ హాల్ లోకి మార్చేశారని కూడా అన్నారు. అంతేకాకుండా.. రక్తంతో తడిచిన అనేక వస్తువుల్ని కూడా అక్కడ లేకుండా చేశారన్నారు.
The following information that I have gathered from my various reliable sources might be germane for the purpose of Investigation undertaken by the @CBIHeadquarters:-
1. The viscera of the deceased victim Doctor has been changed by the @KolkataPolice in the name of…
— Suvendu Adhikari (@SuvenduWB) August 17, 2024
ఆధారాలను పూర్తిగా తారుమారు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత అక్కడ కొత్తగా వాష్ బేసిన్ సైతం ఏర్పాటు చేశారని అన్నారు. అంతేకాకుండా.. అక్కడ ఆధారాలను తారుమారు చేసే పనులు జరిగినట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని కూడా సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై తొందరలోనే సీబీఐ పూర్తిగా విచారణ జరిపి అసలైన నిందితుల్ని అదుపులోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోల్ కతా ఘటన దేశాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 9 న జూనియర్ డాక్టర్ ను.. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉంది.
అప్పుడు కొంత మంది దుర్మార్గులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. ఆమె శరీరంలో 150 ఎంఎల్ ల వీర్యం, మరోవైపు కళ్లు, నోటిలో నుంచి రక్తం బైటకు వచ్చిన ఆనవాళ్లు కన్పించాయి. ఆమె మెడ ఎముక పూర్తిగా ధ్వంసమైంది. అంతర్గత అవయవాలు సైతం బ్లీడింగ్ కు గురి అయ్యాయి. ఈ ఘటనపై హైకోర్టు కూడా మమతా సర్కారు పై సీరియస్ అయ్యింది. ఇది ముమ్మాటికి పోలీసులు, ప్రభుత్వం వైఫల్యమంటూ చురకలు పెట్టింది. తాజాగా, దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవీ స్పందించారు.
కోల్ కతా ఘటనపై మమతా సరైన విధంగా చర్యలు తీసుకొలేదని ఆశాదేవీ విమర్శించారు. ఆగస్టు 9 న ఘటన తర్వాత.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. దుండుదులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో విధ్దంసం చేయడం కూడా.. మమతా వైఫల్యమన్నారు. కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకు మాత్రం.. ఆమె నిరసనలు తెలియజేశారన్నారు. ఒక సీఎం స్థానంలో ఉండి.. న్యాయం చేయాల్సిన పోజిషన్ లో ఉండి..నిరసనతెలియజేయడం ఏంటని కూడా మండిపడ్డారు. కేవలం కొంత మంది నిందితుల్ని పట్టుకుని కేసును నీరు గార్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆశాదేవీ ఆవేదనవ్యక్తంచేస్తున్నారు.
Read more: Kolkata murder case: మమత నువ్వు దిగిపో.. కోల్ కత్తా ఘటనపై నిప్పులు చెరిగిన నిర్భయ తల్లి..
ఒక మహిళ సీఎం అయి ఉండి కూడా.. జూనియర్ డార్టర్ ను న్యాయం చేయడంలో మమతా పూర్తిగా విఫలమయ్యారని కూడా ఎద్దేవా చేశారు. మమతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ.. కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలన్నారు. ఆ నేరస్థుడికి వేసే శిక్షను చూసి.. భవిష్యత్యులో మరోకరు చేయాలంటేనే భయపడేలా ఉండాలన్నారు. మరోవైపు..ఈ ఘటనపై ఐఎంఏ తాజాగా మోదీకి లేఖను రాసింది. ఈ ఘటలనో కల్గజేసుకొవాలని కూడాకోరినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి