Demonetisation: నోట్ల రద్దు చట్ట విరుద్ధమే, ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించలేదు

Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అంతా ఓ వైపుంటే..ఆమె మాత్రం మరో వైపున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో..ఆమె మాత్రం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఓటేశారు. అసలేం జరిగిందంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2023, 10:39 PM IST
Demonetisation: నోట్ల రద్దు చట్ట విరుద్ధమే, ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించలేదు

డీమానిటైజేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే ఇదే ధర్మాసనానికి చెందిన జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో విభేధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలో జస్టిక్ బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, వి రామసుబ్రహ్మణియన్, బీవీ నాగరత్నల ధర్మాసనం 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ధర్మాసనంలో మెజార్టీ అంటే నలుగురు సభ్యులు నోట్ల రద్దును సమర్ధించగా ఒకే ఒక న్యాయమూర్తి మాత్రం విభేధించారు. దాంతో 4-1తో నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్ధించింది. 

నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించలేదని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో కేవలం ఆర్బీఐ నుంచి అభిప్రాయం మాత్రమే తీసుకున్నారన్నారు. మొత్తం ప్రక్రియ 24 గంటల్లో జరిగిపోయిందన్నారు. వెరసి డీమానిటైజేషన్ ప్రక్రియ చట్ట విరుద్ధమని..ఉల్లంఘన అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. 

ఈ విషయంలో ఆర్బీఐ స్వతంత్రంగా ఆలోచించలేదని జస్టిస్ బీవి నాగరత్న స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన డీమానిటైజేషన్ ప్రతిపాదనపై ఆర్బీఐ కనీసం బుర్ర పెట్టి ఆలోచించలేదన్నారు. ఆర్బీఐ సమర్పించిన నివేదిక బట్టి చూస్తే..కేంద్ర ప్రభుత్వం సిఫారసును యధావిధిగా ఆమోదించినట్టుందన్నారు. ఈ అంశంపై ఆర్బీఐ కనీసం ఆలోచించలేదన్నారు. ఇలాంటి తీవ్రమైన ఆర్ధిక మార్పుల్ని మేధావులు, నిపుణులుండే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంక్ ముందు ఉంచాలన్నారు. 

జస్టిస్ బీవి నాగరత్నం ఏం చెప్పారు

2016 నవంబర్ 8న విడుదలైన డీమానిటైజేషన్ గెజిట్ నోటిఫికేషన్ చట్ట విరుద్ధం, నోటిఫికేషన్ కూడా చట్టబద్ధంగా లేదు. అయితే 2016లో జరిగినందున స్టేటస్ కో రీస్టోర్ చేయలేం.

ఆర్బీఐ అనేది భారత ఆర్ధిక వ్యవస్థకు ఓ రక్షణ కవచం లాంటిది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన డీమానిటైజేషన్ చరిత్రను ప్రస్తావించాను. సెక్షన్ 26 (2) పరిశీలించడం అంటే డీమానిటైజేషన్ నిర్ణయాన్ని సమర్దించడం కాదు. 

కేంద్ర ఆదేశాల ప్రకారం బ్యాంకుల ద్వారా జరిగే నోట్ల రద్దు అనేది పౌరుల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. అందుకే నా దృష్టిలో కేంద్రానికుండే అధికారాలు ప్లీనరీ చట్టంలో కూడా ఉండాలి.

పార్లమెంట్ లేకుండా ప్రజాస్వామ్యం లేదు. అటువంటప్పుడు ఇలాంటి కీలకమైన నిర్ణయాలకు పార్లమెంట్ దూరంగా ఉండకూడదు.

500, 1000 నోట్లు రద్దు చేసిన తరువాత 2000 రూపాయల నోటు విడుదల చేయడంతో..నోట్ల రద్దు ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యం నెరవేరలేదని గమనించాలి.

Also read: SC Demonetisation Judgement: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News