NJAC vs Collegium: కొలీజియంను రద్దు చేసే ఎన్‌జేఏసీని కేంద్రం తిరిగి ప్రవేశపెట్టనుందా

NJAC vs Collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై ప్రశ్నలు ఉత్పన్నమౌతున్న క్రమంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమీషన్ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యల నేపధ్యంలో అసలేం జరుగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2022, 11:36 PM IST
NJAC vs Collegium: కొలీజియంను రద్దు చేసే ఎన్‌జేఏసీని కేంద్రం తిరిగి ప్రవేశపెట్టనుందా

దేశంలో వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని సిఫారసు చేసే వ్యవస్థ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ. ఈ వ్యవస్ధ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఆ వ్యవస్థ చుట్టూ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

గతంలో అంటే 2015-16 లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమీషన్ యాక్ట్ 2014 స్థూలంగా ఎన్‌జేఏసీను అప్పట్లో పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించాయి. వివాదాస్పద సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

ఇప్పుడీ చట్టం మరోసారి తెరపైకి వస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై ఇటీవల ప్రశ్నలు రేకెత్తడం, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తరచూ కొలిజీయం వ్యవస్థ సార్ధకతను ప్రశ్నించడంతో ఎన్‌జేఏసీ మరోసారి తెరపైకి వచ్చింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ కూడా ఈ చట్టం గురించి మాట్లాడారు. పార్లమెంట్ ఆమోదించి ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడమంటే..ప్రజా నిర్ణయాన్ని తిరస్కరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ సార్వభౌమత్వం రాజీపడినట్టేనన్నారు. ఎన్‌జేఏసీ రద్దుపై మరోసారి తన స్వరాన్ని విన్పించారు. పార్లమెంట్ అనేది ప్రజా శాసనాల్ని సంరక్షించేదని..ఈ సమస్యపై మరోసారి దృష్టి సారించాలన్నారు. పార్లమెంట్ ఆ దిశగా చర్యలు చేపడుతుందని నమ్ముతున్నట్టు ఆయన చెప్పారు. 

మరోవైపు గత వారం ఓ సమావేశంలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సమక్షంలో కూడా ధనకర్ ఎన్‌జే‌ఏసీ రద్దును ప్రశ్నించారు. చట్టాల్ని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ప్రశ్నించారు. 2015-16లో పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టంతో ఆ చట్టం రాజ్యాంగ నిబంధన అయినప్పుడు..న్యాయస్థానం ఎలా కొట్టివేస్తుందని ప్రశ్నించారు. విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే చట్టాలు చేయకపోతే ఎలా అని అడిగారు.

ఈ క్రమంలో ఎన్‌జేఏసీ చట్టాన్ని మళ్లీ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందా అని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం నేత జాన్ బ్రిటాస్‌లు రాజ్యసభలో అడిగారు. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు.

Also read: AAP as National Party: ఆప్‌కు అరుదైన గుర్తింపు, ఇక ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News