నారదుడు జర్నలిస్టు.. సీత ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ!

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ ఇతిహాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jun 2, 2018, 12:57 PM IST
నారదుడు జర్నలిస్టు.. సీత ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ!

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ ఇతిహాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతాదేవీ టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ ద్వారా జన్మనిచ్చిందన్నారు. అంతేకాకుండా జర్నలిజం మహాభారత కాలంలోనే ఉందని.. నారదుడు అప్పట్లో జర్నలిస్టుగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయనో గూగుల్. ఏక్కడి నుంచి ఎక్కడికైనా, ఎవరికైనా సందేశం పంపగలరని అన్నారు. ఇక ఇప్పటి విమానం అప్పట్లో పుష్పకవిమనంగా ఉండేదన్నారు.

గురువారం రాత్రి ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘లంక నుంచి రాముడు పుష్పక విమానంలో తిరిగొచ్చాడని మనకందరికీ తెలుసు. రామాయణ కాలంలోనే విమానాలు ఉన్నాయని దీని ద్వారా నిరూపితమవుతోంది. సీతాదేవి తల్లి గర్భం నుంచి జన్మించలేదు. జనకుడు పొలం దున్నుతుండగా భూమిలో ఓ పాత్ర నుంచి సీతాదేవి ఉద్భవించింది. అంటే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ విధానం ఆ రోజుల్లో ఉంది’ అని దినేశ్‌ అన్నారు.

ఇదిలా ఉండగా సీతను ఎత్తుకెళ్లింది రాముడే.. అంటూ గుజరాత్‌ పాఠ్యపుస్తకంలో ప్రచురితమవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 106వ పేజీలో రఘువంశం పాఠ్యాంశంలో రామాయణంలో సీతను ఆపహరించింది రాముడేనని ముద్రించారు.  అనువాద లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని గుజరాత్ స్టేట్ బోర్డు స్పష్టం చేసింది. కాగా.. ఇటీవలే రాజస్థాన్‌లోనూ 8వ తరగతి పుస్తకంలో బాలగంగాధర్ తిలక్‌ను 'ఫాదర్ ఆఫ్ టెర్రరిజం' గా తప్పు ముద్రించారు.

Trending News