Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష డైలాగ్‌ వార్‌ అంశంపై స్పందించిన గాయకుడు సోను నిగమ్‌..!

Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష ఔనని కొందరు.. కాదని మరికొందరు. ఇదే అంశంపై దక్షిణాది, ఉత్తరాది హీరోల నడుమ గత కొద్దిరోజుల నుంచి డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌ స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 05:27 PM IST
  • హిందీ జాతీయ భాష అంశంపై స్పందించిన సోనునిగమ్‌
  • హిందీ జాతీయ భాష కాదని స్పష్టం చేసిన సోనునిగమ్‌
  • ఇంటర్వ్యూలో వ్యక్తపరిచిన సోనునిగమ్‌
 Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష డైలాగ్‌ వార్‌ అంశంపై స్పందించిన గాయకుడు సోను నిగమ్‌..!

Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష ఔనని కొందరు.. కాదని మరికొందరు. ఇదే అంశంపై దక్షిణాది, ఉత్తరాది హీరోల నడుమ గత కొద్దిరోజుల నుంచి డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌ స్పందించారు. బీస్ట్‌ స్టూడియోస్‌ సీఈవో అండ్‌ ఫౌండర్‌ సుశాంత్‌ మెహతాతో జరిగిన ఇంటర్వ్యూలో హిందీ భాషపై తన మనుసులోని మాటను వ్యక్తపరిచాడు సోనునిగమ్‌.

సోను నిగమ్‌.. హిందీ  జాతీయ భాష కాదని స్పష్టం చేశారు. హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలో రాసి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకునే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. దేశంలో హిందీ  ఎక్కువగా వాడుకలో ఉండే భాష మాత్రేమే అన్నారు. తనకు తెలిసినంత వరకు తమిళ భాష అత్యంత పురాతనమైనదని చెప్పారు. సంస్కృతి- తమిళ భాష విషయంలో చర్చ జరిగితే ప్రజలంతా తమిళ భాషే పురాతనమైనదంటారన్నారు. ఇతరులపై భాష సంస్కృతిని రుద్దుతూ దేశంలో అసమ్మతులను పెంచుతున్నామని సోను నిగమ్‌ అభిప్రాయపడ్డారు. ఎవరు ఏం భాష మాట్లాడాలో నిర్ణయించుకునే అధికారం లేదా అని ప్రశ్నించారు. ఏ భాష సౌకర్యవంతంగా ఉంటుందో అదే భాష మాట్లాడుతారని సోను చెప్పారు.

గతంలో అజయ్‌ దేవగన్‌- కన్నడ స్టార్‌ కిచ్చ సుదీప్‌ మధ్య ఇదే అంశంపై ట్విట్టర్‌ వార్‌ నడించింది. దక్షిణాది భాష సినిమాలు రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో హిందీ జాతీయ భాష కాదని సుదీప్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు.  సుదీప్‌ వ్యాఖ్యలను అజయ్‌ దేవగన్‌ ఖండించారు. హిందీ జాతీయ భాష కానప్పుడు.. ప్రాంతీయ భాషల సినిమాలు హిందీలో ఎందుకు డబ్‌ చేస్తున్నారన్నారు. దీనికి సుదీప్‌ మళ్లీ  రిప్లై ఇచ్చాడు. మీరు హిందీలో పంపిన మెసేజ్‌ నాకు అర్ధమైందంటే.. హిందీని నేర్చుకోవడం వల్లే అని చెప్పారు. కానీ నా రిప్లై కన్నడలో ఇసస్తే మీ పరిస్థితి ఏంటీ అన్నాడు అజయ్‌ దేవగన్‌  కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

Also Read: National Medical Commission Bill: ఎంబీబీఎస్‌ విద్యలో రాబోతున్న కీలక మార్పులు..!

Also Read: Russia Claims Lsrael Supports: రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య మాటల యుద్ధం..దుమారం లేపుతున్న ఆయన వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News