Father Rapes Daughter: షాకింగ్.. కన్నబిడ్డపై 10 నెలలుగా తండ్రి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..

Rape Incident in Tamilnadu: కన్న కూతురు అనే కనీస మానవత్వం కూడా లేకుండా ఓ వ్యక్తి తన బిడ్డ పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను గర్భవతిని చేసి ఓ బిడ్డకు తల్లిని చేశాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 5, 2022, 03:33 PM IST
  • తమిళనాడులో షాకింగ్ ఘటన
  • కన్న బిడ్డపై తండ్రి అత్యాచారం
  • బిడ్డకు జన్మనిచ్చిన ఎనిమిదో తరగతి బాలిక
Father Rapes Daughter: షాకింగ్.. కన్నబిడ్డపై 10 నెలలుగా తండ్రి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..

Rape Incident in Tamilnadu: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో ఆమెను కాటేశాడు. పలుమార్లు ఆ చిన్నారిపై అత్యాచారం జరిపి గర్భవతిని చేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం వెలుగుచూసింది. తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు బాధిత బాలికను విచారించడంతో తండ్రి ఆకృత్యాలు బయటపడ్డాయి.

బాధిత బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం.. వెల్లూరు జిల్లాకు చెందిన ఆ బాలిక ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో చాలాకాలంగా నానమ్మ, తాతయ్యల వద్ద పెరుగుతోంది. అక్కడికి సమీపంలోనే ఆమె తండ్రి మరో ఇంట్లో ఉంటున్నాడు. రోజూ నానమ్మ వంట చేశాక ఆ బాలిక తండ్రికి భోజనం తీసుకెళ్లేది. ఈ క్రమంలో తండ్రి తన కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పైగా అత్యాచార విషయం ఎవరికీ చెప్పొద్దని.. చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలికను బెదిరించాడు. అలా గత 10 నెలలుగా కన్న బిడ్డ పైనే పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో నానమ్మ, తాతయ్యలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. ఆగస్టు 2న బాలిక బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో బాధిత బాలికను విచారించారు. తండ్రి అత్యాచారం వల్లే ఇలా జరిగిందని, తనను బెదిరింపులకు గురిచేయడం వల్లే ఎవరికీ చెప్పలేకపోయానని బాధిత బాలిక వాపోయింది. దీంతో వెల్లూరు పోలీసులు బాలిక తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కన్న కూతురినే తల్లిని చేసిన ఆ నీచపు తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: Komatireddy Venkat Reddy: బీజేపీ గూటికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..? కమలనాథుల ప్లాన్‌ అదేనా..!

Also Read: Arresting Rules: పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే.. నిందితులకు ఉండే హక్కులివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News