Security Saves Two Lives: ప్రయాణ సమయాల్లో.. బాహ్య ప్రదేశాల్లో చిన్నారులను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ సంఘటన చెబుతుంది. దీంతోపాటు ప్రమాదం సమయంలో సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలో కూడా ఈ సంఘటన ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ప్రమాదం సమయంలో వాటి నివారణకు ఉన్న అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఒక్క ఘటన సూచిస్తుంది. మహారాష్ట్రలోని పుణె మెట్రో స్టేషన్‌లో ఈనెల 19వ తేదీన ఓ ఘటన జరిగింది. సివిల్ కోర్టు అనే మెట్రో స్టేషన్‌లో మధ్యాహ్నం 2.22 సమయంలో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు.
వేగంగా వెళ్తున్న బాలుడి వెంట తల్లి కూడా పరుగెత్తుకుంటూ వెళ్లింది. పట్టాలపై పడిన బాలుడిని కాపాడేందుకు ఆ తల్లి వెనకాముందు చూసుకోకుండా పట్టాలపైకి దూకింది. జరగబోయే ప్రమాదాన్ని అక్కడే సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వికాస్ బంగర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. స్టేషన్ గోడపై ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కాడు. అత్యవసర బటన్ నొక్కిన కారణంగా రెండువైపులా వేగంగా వస్తున్న మెట్రో రైళ్లు అక్కడికక్కడే ఆగిపోయాయి.
In a remarkable act of quick thinking and bravery, a #PuneMetro guard averted a potential tragedy by saving the lives of a 3-year-old boy and his mother who accidentally fell on the tracks at the Civil Court station on Friday. 1/2#Pune pic.twitter.com/CKT9QbmZHy
— Siraj Noorani (@sirajnoorani) January 20, 2024
రైళ్లు ఆగిపోవడంతో తల్లీబిడ్డ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో సెక్యూరిటీ గార్డు వ్వవహరించిన తీరు సమయస్ఫూర్తితనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కిందపడిన తల్లీబిడ్డను కాపాడేందుకు అతడు పట్టాలపైకి వెళ్లవచ్చు. కానీ జరుగాల్సిన ప్రమాదం జరగక మానదు. ఆ సమయంలో ఏది చేస్తే ప్రమాద తప్పుతుందో అదే సెక్యూరిటీ గార్డు వికాస్ చేశాడు. అత్యవసర బటన్ నొక్కితేనే ఆ తల్లీబిడ్డలు ప్రమాదం నుంచి బయటపడతారు. రైలు దూరం ఉన్న సమయంలోనైతే వ్యక్తిగతంగా కాపాడితే సరిపోతుంది. కానీ రైళ్లు చేరువగా చేరుకున్న సమయంలో అప్రమత్తత బటన్ నొక్కడం ద్వారా వారిని కాపాడగలం. ఈ విషయాన్ని గ్రహించిన వికాస్ ఆగమేఘాల మీద స్పందించి అత్యవసర బటన్‌ను నొక్కాడు.
బటన్ నొక్కిన కారణంగా రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అనంతరం ఆ తల్లీబిడ్డను ప్రయాణికుల సమయంతో సెక్యూరిటీ గార్డు బయటకు తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న పుణె మెట్రో అధికారులు సెక్యూరిటీ గార్డు వికాస్‌ను అభినందించారు. కాగా మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన వికాస్‌ను ప్రశంసించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికాస్‌కు ప్రత్యేక బహుమతి ఇవ్వాలని పుణె మెట్రో అధికారులు భావిస్తున్నారు.
ఈ సంఘటన మనకు కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తోంది. ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలో చూపిస్తోంది. కొన్ని కొన్నిసార్లు తెలివిని ఉపయోగిస్తే ప్రమాద తీవ్రతను భారీగా తగ్గించవచ్చు. ధన, ప్రాణాలను కాపాడినవారవుతారు. సమయస్ఫూర్తి అనేది ప్రమాదాలను నివారిస్తాయి. మీరు కూడా ఎక్కడైనా ప్రమాదాలు సంభవించిన సమయంలో కొంత ఆలోచిస్తే చక్కటి పరిష్కారం లభిస్తుంది.
Also Read: Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook