టోక్యో: జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని మోదీ విలువైన బహుమతులు అందజేశారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన సందర్భంలో మోడీ జపాన్ ప్రధాని షింజో అబేను కలుసుకున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ ఈ మేరకు బహుమతి ప్రదానం చేశారు. కాగా మోడీ ఇచ్చిన విలువైన గిఫ్ట్ కు షింజో అబే సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతకీ మోడీ ఇచ్చి గిఫ్ట్ ...
రాజస్థాన్లో రోజ్ క్వార్జ్, యెల్లో క్వార్జ్తో తయారు చేసిన రాతి పాత్రలతో పాటు ఉత్తరప్రదేశ్ చేనేత కళాకారులు నేసిన ధురీస్ను అందజేశారు. అంతేకాకుండా జోధ్పురి సంప్రదాయ పనితీరు ఉట్టిపడే చెక్కపెట్టెను బహుకరించారు. కాగా షింజో అబేకు అందజేసిన ఈ బహుమతులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పర్యవేక్షణలో తయారు చేయడం విశేషం. వాస్తవానికి భారత ప్రధాని మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా బహుమతులను అందజేస్తుంటారు. కారణం భారత హస్తకళలను ప్రమోట్ చేసేందుకేనట.. భారతదేశం హస్తకళలకు ప్రసిద్ధి అని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ మేరకు బహుమతులు ఇస్తుంటారట. చిన్న ఐడీయా జీవితాన్ని మార్చినట్లు..చిన్న చిట్కాతో భారత హస్తకళ నైప్యంలో ప్రపంచానికి చాటిచెబుతున్నారు మన భారత ప్రధాని......... మోడీనా మజాకా...!!