ముగిసిన పోలింగ్.. తెలంగాణ, ఏపీలో 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

Last Updated : Apr 11, 2019, 07:52 PM IST
ముగిసిన పోలింగ్.. తెలంగాణ, ఏపీలో 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

న్యూఢిల్లీ: లోక్ సభ తొలి విడత ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారమే సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ కొనసాగగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇలా వుంది.

ఆంధ్రప్రదేశ్- 66% (25 లోక్ సభ స్థానాలు) 
తెలంగాణ : 60.57% (17 లోక్ సభ స్థానాలు)
ఉత్తరాఖండ్ 57.85 % ( 5 లోక్ సభ స్థానాలు)
జమ్ముకాశ్మీర్ 54.49% ( 2 లోక్ సభ స్థానాలు)
సిక్కిం : 69% (1 లోక్ సభ స్థానం)
మిజోరాం : 60% (1 లోక్ సభ స్థానం)
నాగాలాండ్ : 78% (1 లోక్ సభ స్థానం)
త్రిపుర : 81.8% (1 లోక్ సభ స్థానం)
అస్సాం : 68% (5 లోక్ సభ స్థానాలు)
పశ్చిమ బెంగాల్ 81% (2 లోక్ సభ స్థానాలు)
బిహార్ : 50.26% 
మేఘాలయ : 62%
ఉత్తర్ ప్రదేశ్ : 59.77%
మణిపూర్ : 78.20%
లక్షద్వీప్ : 65.9%

ప్రాథమిక సమాచారం ప్రకారం పోలింగ్ శాతం గణాంకాలు ఇలా వుండగా పూర్తి స్థాయి గణాంకాల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించిన కారణంగా పోలింగ్ ఆలస్యమైన ప్రాంతాల్లో, రవాణా, సమాచార వ్యవస్థ సరిగ్గా లేని ఈశాన్య ప్రాంతాల నుంచి గణాంకాలు ఆలస్యంగా అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Trending News